»   » డార్క్‌ అండ్‌ ఎమోషనల్‌ సస్పెన్స్‌ డ్రామా "నరకాసురుడు": సినిమా పిచ్చెక్కించేలా ఉంది

డార్క్‌ అండ్‌ ఎమోషనల్‌ సస్పెన్స్‌ డ్రామా "నరకాసురుడు": సినిమా పిచ్చెక్కించేలా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమ్ మీనన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి రెండో సారి గుర్తు చేయక్కరలేదు. తన సినిమా ఒక స్పెషల్, దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వెర్సటైల్ డైరెక్టర్ నిర్మాణంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు.

యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్

యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్

డి 16 సినిమాను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో "నరగాసురన్" అనే సినిమా రాబోతోంది. తెలుగులో నరకాసురుడు గా రాబోతున్న ఈ సినిమాలో సందీప్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. మానగరం సినిమాతో కోలీవుడ్ కు సందీప్ సుపరిచితుడే.

Sundeep Kishan Speech @ Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
తెలుగులో ‘నరకాసురుడు'

తెలుగులో ‘నరకాసురుడు'

నరకాసురుడిలో సందీప్ కిషన్ రోల్ సినిమాకే హైలైట్ అవుతుందని కోలీవుడ్ టాక్. డార్క్‌ అండ్‌ ఎమోషనల్‌ సస్పెన్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తెలుగులో ‘నరకాసురుడు' అని టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు, ఇందులో అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నట్లు దర్శకుడు నరేన్‌ ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. వెంటనే ‘గుడ్‌లక్‌ టు ఆల్‌ నరగాసురన్‌ టీమ్‌' అని అరవింద్‌ ట్వీట్‌ చేశాడా

గౌతమ్ మీనన్ .. కార్తీక్ నరేన్

గౌతమ్ మీనన్ .. కార్తీక్ నరేన్

గౌతమ్ మీనన్ .. కార్తీక్ నరేన్ కాంబినేషన్ కారణంగా నరకాసురుడు సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత సందీప్ కిషన్ హీరోగా మరో సినిమాను నిర్మించాలని గౌతమ్ మీనన్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కనుంది.

హిట్ సినిమాలు లేక

హిట్ సినిమాలు లేక

నటుడిగా మంచి పర్ఫార్మన్స్ ఇస్తున్నా...హిట్ సినిమాలు లేక సందీప్ సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. శమంతకమణి చిత్రం ఫరవాలేదనిపించినా తాజాగా వచ్చిన నక్షత్రం సినిమా సందీప్ కెరీర్ లో ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో గౌతమ్ మీనన్ సినిమాల మీద గంపెడాశలు పెట్టుకున్నాడు సందీప్.

ద్విభాషా చిత్రంగా

ద్విభాషా చిత్రంగా

గౌతమ్ సినిమాతో సందీప్ కిషన్ కెరీర్ ఊపందుకుంటుందేమో వేచి చూడాలి. తమిళం, తెలుగు ద్విభాషా చిత్రంగా దీనిని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ఇరు చిత్రపరిశ్రమలకు సుపరిచితులైన నటులను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ సమాచారం.

English summary
Popular Tamil film maker Gautham Vasudev Menon is busy directing Chiyaan Vikram for the flick Dhruva Natchathiram. On the other side, he is planning his productional ventures in both Tamil and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu