Don't Miss!
- News
చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
విక్రమ్ కొడుకుతో జాన్వీ కపూర్ రొమాన్స్.. అర్జున్ రెడ్డి రీమేక్ కొత్త డైరెక్టర్ ఎవరో తెలుసా!
స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ డెబ్యూ మూవీ వర్మ. తెలుగు బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ రెడ్డికి ఇది తమిళ రీమేక్. ఈ చిత్రంలో తన కుమారుడు నటిస్తున్నాడు అని విక్రమ్ ప్రకటించగానే.. ధృవ్ లాంచింగ్ కు ఇదే సరైన చిత్రం అని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వెంటనే సీనియర్ దర్శకుడు బాల దర్శత్వంలో వర్మ పేరుతో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించసారు. అంతా బాగానే జరిగింది. ట్రైలర్ కూడా విడుదలై అంచనాలు పెంచేసింది. ధృవ్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని రద్దు చేస్తున్నాం అంటూ నిర్మాతలు ప్రకటించారు. మళ్ళీ కొత్తగా షూటింగ్ మొదలు పెడతాం అని ప్రకటించడంతో అంతా షాక్ కి గురయ్యారు.

విక్రమ్‌కు నచ్చలేదా
ఈ చిత్ర ఫైనల్ అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడితో కూడా విభేదాలు ఉన్నట్లు తెలిపారు. ధృవ్ హీరోగా, కొత్త దర్శకుడు, కొత్త టీంతో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని తిరిగి షూట్ చేస్తామని ప్రకటించారు. నిర్మాతలు ఈ ప్రకటన చేసినా.. అసలు ఈ చిత్రం విషయంలో అసంతృప్తిగా ఉన్నాది విక్రమ్ అట. సినిమా అవుట్ పుట్ నాసిరకంగా ఉందని.. ఈ చిత్రం విడుదలైతే తన కొడుకు భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని విక్రమ్ భావించాడట.

నిర్మాతలకు చెప్పి
దీనితో నిర్మాతలతో మాట్లాడి విక్రమ్ ఈ చిత్రాన్ని రద్దు చేయించాడు. ఎంత నష్టమైనా నేను భరిస్తా.. సినిమాని మళ్ళీ కొత్తగా ప్రారంభించండి అని తెలిపాడు. విక్రమ్ మాట ప్రకారం నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ని కూడా మార్చేస్తునట్లు వార్తలు వచ్చాయి. వర్మ చిత్రంలో ధృవ్ కి జోడిగా మేఘ చౌదరి నటించింది.

కొత్త హీరోయిన్
తాజాగా ఈ చిత్రాన్ని కొత్త హీరోయిన్, దర్శకుడి గురించి క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది. మేఘ చౌదరిని తప్పించిన చిత్ర యూనిట్ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తోందట. ఇది కనుక నిజమైనతే జాన్వీ కపూర్ సౌత్ లో అడుగుపెట్టేందుకు ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటికే జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దఢక్ చిత్రంతో మెప్పించింది.
శ్రీదేవి లోకాన్ని వీడి ఏడాది.. ఫ్యామిలీ భావోద్వేగం.. ప్రథమ వర్ధంతి ఎక్కడంటే..

డైరెక్టర్ ఎవరంటే
ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఇతనే అంటూ క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. వాసుదేవ్ మీనన్ స్టైలిష్ చిత్రాలు, ప్రేమ కథలు రూపొందించడంలో స్పెషలిస్ట్. వాసుదేవ్ మీనన్ దర్శత్వం వహించిన రొమాంటిక్ మూవీ ఏ మాయ చేశావే ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శత్వంలోనే ధ్రువ నక్షత్రం చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమే ఆయన్ని తన కొడుకు చిత్రానికి దర్శత్వం వహించాలని రిక్వస్ట్ చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది.