»   » తెలిసిపోయింది: నమ్ముతారా... నయనతారకు గౌతం మీనన్‌ విలన్!

తెలిసిపోయింది: నమ్ముతారా... నయనతారకు గౌతం మీనన్‌ విలన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఏమి మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనస్సు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన విలన్ గా కనిపించబోతున్నాడంటే నమ్మగలరా.. నవతరం ప్రేమ కథల దర్శకుడుకు ఇప్పుడు నటన మీదకు దృష్టి మరిలినట్లుంది.

పూర్తి వివరాల్లో వెళితే... ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్‌ ఇప్పుడు విలన్‌గా వెండితెరకు పరిచయం కానున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇమైక్క నొడిగల్‌'. ఇందులో అధర్వ హీరో. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో గౌతం మీనన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

Gautham Menon plays the villain in Atharva's Imaikka Nodigal

ఈ కథ బాగా నచ్చడంతోనే విలన్‌గా నటించేందుకు గౌతం సమ్మతించారని తెలుస్తోంది. మరోవైపు అధర్వకు దీటుగా నయనతార ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

ఇటీవల శింబుతో తమిళంలో, చైతూతో తెలుగులో సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ మీనన్ ఇప్పుడు నాలుగు భాషలలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా స్వీయ నిర్మాణం లోనే అట తెలుగులో సాయి ధరమ్‌ తేజ్‌, మలయాళంలో పృధ్వీరాజ్ , కన్నడ నటుడు పునీత్‌ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలుగా గౌతమ్ మీనన్‌ మూవీ తెరకెక్కనున్నట్టు సమాచారం. తమిళంలో శింబూ లేదా జయం రవి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఈ ఇద్దరిలో అసలు హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్దికాలం క్రితం రామ్ చరణ్ అల్లుఅర్జున్ లతో చర్చించి నట్లు టాక్. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ బన్నీలు పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను గౌతమ్ మీనన్ కొంతకాలం అటక ఎక్కించి ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నాడని తెలుస్తోంది.

English summary
Director Gautham Menon, who is widely known for his surprise cameo roles, is likely to don a full-fledged villain role in the upcoming film Imaikka Nodigal, which stars Atharva and Nayanthara in the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu