»   » మహేష్ సినిమాతో సమస్యలో పడ్డ 'ఏం మాయ చేసావే' దర్శకుడు

మహేష్ సినిమాతో సమస్యలో పడ్డ 'ఏం మాయ చేసావే' దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏమి మాయ చేసావే చిత్రం డైరక్ట్ చేసిన గౌతం మీనన్ కి మహేష్ బాబు కొత్తగా కమిటయిన త్రి ఇడియట్స్ తో సమస్య వచ్చింది. దానకి కారణం ఆయన ఏమి మాయ చేసావే హిందీ వెర్షన్ కి మనోజ్ పరమహంసను కెమెరామెన్ గా ఎంపిక చేసుకున్నారు.ఎగ్రిమెంట్ జరిగే సమయానికి పరమహంసకు శంకర్ నుంచి పిలుపు వచ్చింది. మహేష్ హీరోగా చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ ను పరమహంసను కెమెరామెన్ గా చేయమని అన్నారు. దాంతో గౌతమ్ మీనన్ ప్రాజెక్టు వదిలేసి వెంటనే శంకర్ ప్రాజెక్టుకి షిప్ట్ అయిపోయాడు. దాంతో గౌతం మీనన్ షాక్ అయినా మరో కెమెరా మెన్ వేటలో పడ్డాడు.

ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చేసిన లీడ్ క్యారెక్టర్ ని తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ చేస్తారు. ఇక శర్మాన్ జోషి చేసిన పాత్రను తెలుగు, తమిళంలో శ్రీరామ్(ఒకరికి ఒకరు ఫేమ్) చేస్తారు. ఇక మాధవన్ పాత్రకు తమిళ హీరో జీవాని ఎంపిక చేసారు. ఇలియానా..కరినా కపూర్ పాత్రకు, సత్యరాజ్..బొమన్ ఇరాని చేసిన ప్రొపిసర్ పాత్రలో కనిపించనున్నారు. హ్యారీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఏ మాయ చేసావేకి కెమెరా వర్క్ చేసిన మనోజ్ పరమహంసని ఛాయా గ్రహణంకు ఎంపిక చేసారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. టైటిల్ గా త్రీ రాస్కేల్స్ అని పెడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu