Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లారీని గుద్దేసిన గౌతమ్ మీనన్ కారు.. తప్పిన పెనుముప్పు.. తృటిలో ప్రాణాలతో..
Recommended Video

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవన్ మీనన్ కారు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో గౌతమ్ మీనన్ తృటిలో ప్రాణాలను కాపాడుకోవడంతో ఊపిరి పీల్చుకొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ప్రమాదం
డిసెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున ఉదయం 3.30 నుంచి 4 గంటల మధ్య చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ప్రయాణిస్తున్నారు. తాను ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఓ లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో డ్రైవర్, గౌతమ్ మీనన్ ప్రాణాలతో బయటపడ్డారు.

పరారీలో లారీ డ్రైవర్
కారు ప్రమాదంలో డ్రైవర్‌కూడా స్పల్పంగా గాయాలైనట్టు తెలిసింది. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్‌పై గ్యుండీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.

మద్యం మత్తులో యాక్సిడెంట్
ప్రమాద సమయంలో గౌతమ్ మీనన్, ఆయన డ్రైవర్ మద్యం సేవించినట్టు వచ్చిన వార్తలను పోలీసుల ఖండించారు. గౌతమ్ కానీ, ఆయన డ్రైవర్ మద్యం సేవించలేదు అని పోలీసులు మీడియాకు తెలిపారు.

విక్రమ్‌తో ధ్రువ నక్షత్రం
ప్రస్తుతం చియాన్ విక్రమ్‌తో ధ్రువ నక్షత్రంతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రితూ వర్మ, పార్థిపన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 2018లో విడుదల కానున్నది.

గౌతమ్ మీనన్ రొమాంటిక్ థ్రిల్లర్
ఇదిలా ఉండగా, ఇనాయ్ నోకి పాయమ్ తోటా అనే రొమాంటిక్ థ్రిల్లర్‌ను గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, మేఘా ఆకాశ్ నటిస్తారు. రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపిస్తారు.

సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్
ఇక ఒండ్రగా అనే మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించేందుకు గౌతమ్ మీనన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ యాక్లర్లు నటిస్తారు. ఈ చిత్రంలో తమిళ నటుడు జయరవి, మలయాళం నుంచి పృథ్వీరాజ్ కపూర్, కన్నడ నుంచి పునీత్ రాజ్‌కుమార్, తెలుగులో నుంచి సాయిధరమ్ తేజ్ నటిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుంది.