»   » గౌతమ్ మీనన్ సినిమాకు నిర్మాతగా మారాలనుందా?

గౌతమ్ మీనన్ సినిమాకు నిర్మాతగా మారాలనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ మాయ చేసావె చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన దర్సకుడు గౌతమ్ మీనన్. ఆయన తాజాగా తనతో సినిమా చేయాలనుకునే ఫైనాన్సియల్ పార్టనర్స్ ని ఆహ్వానించటానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోయే ఆ చిత్రానికి గౌతం మీనన్ స్వయంగా బ్యానర్ ఓపెన్ చేస్తున్నారు. Photon Kathaas పేరుతో ఓపెన్ అయ్యే ఈ బ్యానర్ కోసం ఆయన డబ్బులు సేకరించనున్నారు. అందుకోసం షేర్స్ ని త్వరలో ప్రకటిస్తారు. దీనికోసం ఆయన లండన్ స్టాక్ ఎక్సేంజ్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. అది పూర్తి కాగానే షేర్స్ విడుదల చేస్తూ ప్రకటన ఇస్తారు. సినిమా వివరాలు చెప్తారు. ఆసక్తి ఉన్నవాళ్ళు షేర్స్ కొనుక్కుని పెట్టుబడి పెడితే..ఆ చిత్రం మంచి హిట్ అయితే ప్రాఫిట్స్ ని పంచుతారు. అదీ సంగతి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu