»   » మాపైకి సావిత్రి కుక్కలను వదిలారు.. మానాన్న విలన్‌గా చూపిస్తారా? జెమినీ కూతురు!

మాపైకి సావిత్రి కుక్కలను వదిలారు.. మానాన్న విలన్‌గా చూపిస్తారా? జెమినీ కూతురు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahanati Movie Get Opposed From Gemini Ganesan Daughter

తెలుగు ప్రజల అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం తెలుగు నాట అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఓవర్సీస్‌లో బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. మహానటికి మంచి స్పందన వ్యక్తమై మూడో వారంలోకి దూసుకెళ్తున్నది. కాగా ఈ చిత్రం తమిళంలో నడిగైయర్ తిలగం పేరుతో రిలీజైంది.

తమిళనాట కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి ఆదరణ చూపిస్తున్నారు. అయితే తమిళంలో ఈ చిత్రం కాస్త వివాదంలో కూరుకుపోయింది. ఇటీవల పుష్పవల్లి పాత్రను సరిగా చూపించలేదని ఆ రోల్‌లో నటించిన నటి విమర్శలు గుప్పించారు. అలాగే తాజాగా తన తండ్రి పాత్రను తప్పుగా చూపించారని జెమినీ గణేషన్ కుమార్తె కమలా సెల్వరాజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ చిత్రంపై ఆమె ఎలా స్పందించారంటే..

జెమినీని విలన్‌గా

జెమినీని విలన్‌గా

నడిగైయర్ తిలగం సినిమాలో జెమినీ గణేశన్‌ను ఓ విలన్‌గా చిత్రీకరించారు. అందులో కాసింత కూడా నిజంలేదు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది మా నాన్న అన్నట్టు చిత్రీకరించారు. సావిత్రి కష్టాల్లో ఎవరూ ఆదుకోలేదనే విధంగా కథను రాసుకొన్నారు. నిజ జీవితంలో ఇలాంటివి చాలా సత్యదూరం అని కమల పేర్కొన్నారు.

 జెమినీ ప్రతిష్టకు భంగం

జెమినీ ప్రతిష్టకు భంగం

నడిగైయర్ తిలగం చిత్రంలో మా నాన్న జెమినీ గణేషన్ పాత్ర చిత్రీకరణ ఆయన ప్రతిష్ఠకు భగం కలిగించేలా ఉంది. తన భార్య, మా అమమ అలిమేలును కాకుండా సావిత్రినే మరింత ఎక్కువగా ప్రేమించినట్టు పాత్రను చిత్రీకరించారు. మా అమ్మపై మా నాన్నకు ప్రేమే లేనట్టు తీశారు. ఇది వాస్తవానికి దూరంగా ఉంది అని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు.

సావిత్రి అంటే ఇష్టం లేదు

సావిత్రి అంటే ఇష్టం లేదు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేమంటే చాలా ఇష్టంగా చూసుకొనేవారు. మా అమ్మను బాగా ప్రేమించేవారు. వాస్తవానికి సావిత్రి అంటేనే ఆయనకు ఇష్టం ఉండకపోయేది. ఓసారి సావిత్రి ఇంటికి వెళ్లినపుడు మాపైకి పెంపుడు కుక్కలను వదిలారు. అలాంటి వ్యక్తి సావిత్రి అనుకూలంగా సినిమా తీశారు అని ఆమె ధ్వజమెత్తారు.

కమల సెల్వరాజ్ వ్యాఖ్యలు

కమల సెల్వరాజ్ వ్యాఖ్యలు

జెమినీ గణేషన్ కారణంగానే తన జీవితం చరమాంకంలో సావిత్రి దుర్భర జీవితాన్ని అనుభవించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమల చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది. తాజా వివాదంపై చిత్ర యూనిట్ స్పందిస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.

 కమల సెల్వరాజ్ ఘనత ఇదే..

కమల సెల్వరాజ్ ఘనత ఇదే..

గణేశన్‌, అలిమేలు దంపతుల ఇద్దరు సంతానం. ప్రస్తుతం కమల చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా గుర్తింపు ఉంది. 1993లో ఆమె ఉత్తమ వైద్యురాలిగా అవార్డు అందుకున్నారు. 1990లో దక్షిణాదిన తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని సృష్టించిన వైద్యురాలు కమల కావడం విశేషం.

English summary
Great Actor Savitri biopic Mahanati going good. Appreciation coming from all corners. Now, we have come to know that Gemini Ganesan’s daughter Kamala Selvaraj has made some interesting comments on the movie telling that the makers have projected her father in a poor light.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X