»   » గజనీ కాంబినేషన్ మరోసారి 15 నుంచి ...

గజనీ కాంబినేషన్ మరోసారి 15 నుంచి ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్ ‌లో రూపొందనున్న క్రేజీ చిత్రం ఈనెల 15వ తేదీ చెన్నైలో ప్రారంభంకానుంది. గతంలో ఈ కాంబినేషన్‌లో రూపొందిన గజిని సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే అమీర్ ఖాన్ తో గజనీ చిత్రం రీమేక్ చేసి హిట్టు కొట్టిన మురుగదాస్‌ బాలీవుడ్ లో షారూఖ్, అక్షయ్ వంటి హీరోల కోసం ట్రై చేసి తిరిగి తమిళంకు వచ్చి సూర్యతో చేస్తున్నారు. గజని తర్వాత మళ్లీ సూర్యతో చేస్తున్న ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సూర్యకు జంటగా శృతి హాసన్‌ నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చైనాలో చిత్రీకరించనున్నారు. అక్కడ సూర్య పాల్గొనే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విలన్‌ ఎంపిక జరుగుతోంది. ఇక శృతి హాసన్ ప్రస్తుతం రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో సిద్దార్ధ ప్రక్కన చేస్తోంది. సూర్య ప్రక్కన శృతి హాసన్ ని తీసుకోవటంతో ఆమె దశ తిరిగనట్లే అంటున్నారు. ఇక ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు. మరో ప్రక్క శృతి లేటెస్ట్ గా ఎర్ర గులాబీలు రీమేక్ లో చేస్తోంది. భారతీరాజా తనయుడు మనోజ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి...శ్రీదేవి అప్పట్లో చేసిన పాత్రను చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu