Don't Miss!
- News
కేసీఆర్కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? జాగ్రత్త: షర్మిలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
'వేంగై పులి'గా గోపీచంద్ చిత్రం
తమిళ నిర్మాత మాట్లాడుతూ..... అన్ని సినిమాల్లోలాగే ఇందులోనూ హీరో, హీరోయిన్ ని ప్రేమిస్తాడు. అందుకు ఆమె అంగీకరించదు. ప్రేమించకపోతే ప్రాణం తీసుకుంటానని హీరో చెబుతాడు. అందుకు ఆమె 'నువ్వు ప్రాణం తీసుకోనక్కర్లేదు.. నేను చెప్పే ముగ్గరి ప్రాణాలు తీయ్..' అంటుంది. ఆ ముగ్గరు ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చిందన్నదే కథాంశమని పేర్కొన్నారు. 'గిల్లి', 'పయ్యా' స్థాయిలో ఇందులో కూడా పోరాట సన్నివేశాలు నిండుగా ఉన్నాయని తెలిపారు.
తెలుగులో ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు . అయితే భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వర్కవుట్ కాలేదు. ఈ టైటిల్ విషయమై భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నె రవి, కూర్పు: శంకర్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్.