»   »  నేను బ్రతికే ఉన్నా,వాట్సప్ న్యూస్ నమ్మద్దు, స్టార్ కమిడయన్ రిక్వెస్ట్

నేను బ్రతికే ఉన్నా,వాట్సప్ న్యూస్ నమ్మద్దు, స్టార్ కమిడయన్ రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: టెక్నాలిజీ పెరిగిపోయిన తర్వాత ఇంపార్టెంట్ న్యూస్ కు ఎ్ంత ప్రయారిటీ వచ్చి స్పీడుగా స్ప్రెడ్ అవుతోందో...అంతకన్నా స్పీడుగా ఫాల్స్ న్యూస్ కు సైతం ప్రయారిటీ వస్తోంది. ముఖ్యంగా ప్రముఖులు చనిపోయారనే ఫేక్ వార్తలు వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా చాలా స్పీడుగా ప్రచారం అయ్యి అభిమానులతో పాటు, సంబంధిత వ్యక్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

తాజాగా సీనియర్ హాస్యనటుడు గౌండమణి విషయంలో ఇలాంటి సంఘటనే ఎదురై ఆయన్ని చాలా ఇబ్బందికు గురి చేసింది. హాస్య నటుడుగా అశేష ప్రేక్షకులను అలరించిన గౌండమణి తాజాగా హీరోగానూ నటిస్తున్నారు. ఆయన నటించిన ఎనక్కు వేరెంగుం కిళైగళ్ ఇల్లై చిత్రం విడుదలైంది.

ఇలాంటి పరిస్థితుల్లో గౌండమణి ఆనారోగ్యానికి గురయ్యార ని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారాన్ని మీడియా ఊదరగొట్టింది. వాట్సప్ లో మొదలైన ఈ సందేశం..తమిళ సిని అభిమానులను కుదిపేసింది. ఫేస్ బుక్ లో రిప్ అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సందేశాలు సైతం పెట్టేసారు.

Goundamani death rumors clarified

ఈ నేఫద్యంలో ....గౌండరమణి ఆయన తాను ఆరోగ్యంగానే ఉన్నానని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన పీఆర్‌ఓ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ తన గురించి వదంతులు ప్రచారం చేసిన వ్యక్తి ఏవరో గానీ తద్వారా అతనికి కలిగే ఫలితం ఏమిటో తెలియలేదన్నారు. ఈ మధ్య కాలంలో ప్రఖ్యాత నటి కేఆర్.విజయ గురించి కూడా ఇలాంటి వదంతులే ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు.

తాను చక్కగా ఆరోగ్యంగా ఉన్నాననీ, తన తదుపరి చిత్రం గురించి కథా చర్చల్లో పాల్గొంటున్నానని, త్వరలోనే ఆ చిత్రం గురించిన వివరాలను వెల్లడిస్తానని గౌండమణి తెలిపారు. అదే విధంగా తన తాజా చిత్ర ప్రారంభం కార్యక్రమంలో మీడియా సోదరులందరిని కలుసుకుంటానని చెప్పారు. అదండీ విషయం, వాట్సప్ లో వచ్చే ఇలాంటి న్యూస్ లను షేర్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మరి..లేకపోతే మనమే ఫేక్ న్యూస్ ని స్ర్పెడ్ చేసిన వారం అవుతాము.

Read more about: goundamani, died, మృతి
English summary
A WhatsApp forward is making it rounds citing that Goundamani has passed away. His PRO Vijay Murali sent out a statement today citing that they're nothing but mere rumors. The statement said that he had seen Goundamani a while back and he's at his healthy best. The statement read that those 'few good souls' who're spreading these rumors aren't identified yet and it's not understandable on what's the benefit they're going to reap from this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu