»   » బాహుబలి సెట్స్‌లో ‘గులేబకావళి’

బాహుబలి సెట్స్‌లో ‘గులేబకావళి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు భాగాలుగా వచ్చిన 'బాహుబలి' ప్రాజెక్టు ఇండియన్ సినీ పరిశ్రమలో ఓ సంచలనం. బాహుబలి తర్వాత కాస్టూమ్ డ్రామాలకు డిమాండ్ బాగా పెరిగింది. బాహుబలి రేంజిలో కాకపోయినా అలాంటి డ్రామా ఎంతో కొంత తమ సినిమాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

తమిళంలో తెరకెక్కుతున్న 'గులేబకావళి' సినిమాలో కొంతభాగం బాహుబలి మాదిరిగా కాస్టూమ్ డ్రామా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుదేవా, హన్సిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.


బాహుబలి సెట్స్‌లో

బాహుబలి సెట్స్‌లో

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రాజుల కాలం పరిస్థితులకు అద్దంపట్టేలా చిత్రీకరించాల్సి ఉందట. ఆ సన్నివేశాలను బాహుబలి కోసం వేసిన సెట్స్‌లో చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.


15 నిమిషాల సీన్ కోసం

15 నిమిషాల సీన్ కోసం

దర్శకుడు మాట్లాడుతూ.... ‘గులేబకావళి సినిమాకు సంబంధించిన సీన్లు బాహుబలి సెట్స్ లో చిత్రీకరిస్తున్నాం. మా సినిమా 15 నిమిషాల పాటు బాహుబలిలా కనిపించినా మేము సక్సెస్‌ఫుల్ అయినట్లే' అన్నారు.


స్పెషల్ ఎఫెక్ట్స్

స్పెషల్ ఎఫెక్ట్స్

బాహుబలి లాంటి సెట్స్‌లో సీన్లు తీయాలని ముందే నిర్ణయించాము. ఈ సీన్లలో నటీనటులు కూడా రాయల్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఈ పోర్షన్ అంతా స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో కూడుకుని ఉంటుంది అని ప్రభుదేవా తెలిపారు.


రాజమౌళి గురించి

రాజమౌళి గురించి

రాజమౌళి గురించి ప్రభుదేవా మాట్లాడుతూ...‘రాజమౌళి నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. ఆయనతో స్నేహం ఉంది. ఆయన ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలని పరితపిస్తుంటాడు. రాజమౌళి నాకు గైడ్ లాంటి వారు. ఆయన తీసిన విక్రమార్కుడు సినిమాను నేను బాలీవుడ్లో రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేశాను. భవిష్యత్తులో రాజమౌళితో పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
English summary
Tamil film Gulebakavali director Kalyaan revealed that "We'll try to make at least some scenes in Baahubali standard. If 15 minutes of our movie appears like 'Baahubali' we'll be successful." 'Gulebakavali' starring Prabhu Deva, Hansika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu