»   » షాక్ నుంచి తేరుకునే లోపే మళ్ళీ..హన్సిక

షాక్ నుంచి తేరుకునే లోపే మళ్ళీ..హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా. ఈలోపు మళ్లీ ఇలా విరుచుకుపడటం అమానుషం అంటోంది హన్సిక. రీసెంట్ గా ముంబైలో జరిగిన దాడులును గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా మాట్లాడింది. దాడులు జరిగిన సమయంకి కొద్ది నిముషాల ముందే హన్సిక ఆ దారిలో వెళ్లింది. దాంతో కొద్దిగా లేటయితే ఏంటి పరిస్ధితి అన్నట్లు ఆమె భయపడ్డానంటోంది. ఆ వార్త వినగానే షాక్ అయ్యానని, ఆ క్షణాలు తలచుకుంటే భయమేస్తోందని అంటోంది. ఇక మూడేళ్ల క్రితం ముంబైలో జరిగిన దాడులను ఇంకా మర్చిపోలేదు. అప్పడే మళ్ళీ అంటే భయం వేస్తోంది అంది. ముంబై దాడుల్లో దెబ్బతిన్నవారి క్షేమం కోసం నేను మా అమ్మతో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక గుడిలో పూజలు చేశాను అంది. ప్రస్తుతం హన్సిక తెలుగులో కందిరీగ చిత్రం చేస్తోంది.

English summary
Hansika tweeted- “Heart aches when you see all this, we try and forget the past and they revive all over again! Prayers for those affected and healing for the bereaved.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu