»   » సినిమా అంత హిట్టవుతుందనుకోలేదు...హన్సిక

సినిమా అంత హిట్టవుతుందనుకోలేదు...హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

''నేను నటించిన చిత్రం అంత పెద్ద హిట్టవుతుందనుకోలేదు. అలాగే నా పాత్ర లోలితాకి మంచి పేరు తెస్తుందని ఊహించాను. కానీ.. స్పందన ఇంత భారీగా ఉంటుందని ఊహించలేదు"" అంటోంది హన్సిక. ఆమె రీసెంట్ గా నటించిన తమిళ చిత్రం 'ఎంగేయుమ్ కాదల్" తమిళంలో మంచి హిట్ నే నమోదు చేసింది. దాంతో ఆ ఆనందలో ఉన్న హన్సిక ఇలా మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది.అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి హన్సిక మొబైల్ ఎడతెరిపి లేకుండా మోగుతోందట. ఈ విషయాన్ని చెపుతూ.. 'నువ్వు అందంగా ఉన్నావ్. బాగా యాక్ట్ చేశావ్" అనే అభినందనలను ఆ ఫోన్ మోసుకొస్తుంటే... పట్టలేనంత ఆనందంగా ఉందని హన్సిక అంటున్నారు. అది మాత్రమే కాదు ప్రేక్షకుల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనిపించింది. లక్కీగా చెన్నయ్‌లోని 'సత్యం" థియేటర్లో ఆమె నటిస్తున్న 'ఒరు కాల్ కన్నాడి" షూటింగ్ జరిగింది. అదే థియేటర్లోనే 'ఎంగేయుమ్ కాదల్" ఆడటంతో వీలు చూసుకుని హన్సిక సెలైంట్‌గా థియేటర్లో సెటిలయ్యా. కానీ ప్రేక్షకులు గుర్తుపట్టేసి చుట్టుముట్టేశారు అంది. అలాగే తన తాజా చిత్రాలు గురించి చెబుతూ... ప్రస్తుతం తమిళంలో 'వేలాయుధం, ఒరు కాల్ ఒరు కన్నాడి" అనే చిత్రాల్లో, తెలుగులో రామ్ సరసన 'కందిరీగ", సిద్ధార్థ సరసన 'ఓ మై ఫ్రెండ్" చిత్రాల్లో నటిస్తున్నాను అంది.

English summary
Hansika is flying high in Kollywood. Her latest movie Engeyum Kadhal was released on Friday for glowing reviews. Everyone is praising Hansika’s performance and tagging that she is the highlight element in the film. Engeyum Kadhal is directed by Prabhu Deva. Jayam Ravi played the hero in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu