For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హన్సికకు స్టార్ సరసన గోల్డెన్ ఆఫర్

  By Srikanya
  |

  చెన్నై : దేనికైనా రెడీ చిత్రం విజయంతో మంచి ఊపు మీద ఉన్న హన్సికకు మరో ఆఫర్ వరించింది. తమిళ స్టార్ హీరో కార్తీ సరసన ఆమె ఎంపికైంది. ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందనుంది. 'గాంబ్లర్' హిట్ తర్వాత వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ 'బిరియాని'. కార్తి, హన్సిక కలయికలో వస్తున్న తొలిచిత్రం ఇదే. ఇందులో తొలుత రిచా గంగోపాధ్యాయను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఒప్పందంచేసుకోలేదు. కొన్ని కారణాలతో ఆ కథ హన్సిక వద్దకు వెళ్లింది. విన్నవెంటనే ఆమె అంగీకరించింది. ఈ చిత్రంలో ఆమె రిపోర్టర్ గా కనిపించనుంది.

  ఇదిలా ఉండగా రెండో హీరోయిన్ గా మళ్లీ రిచాను ఆశ్రయిస్తే కాదని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ విషయమై రిచా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ప్రారంభంలో హీరోయిన్ గా నటించేందుకు నన్ను సంప్రదించారు. కొంతకాలం తర్వాత ఆ పాత్రలో మార్పులు వచ్చాయి. నేను చేయనన్నానని పేర్కొంది. మరో ముద్దుగుమ్మగా నీతూచంద్రను నటింపజేయాలని నిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె వద్ద సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

  మరో ప్రక్క సిద్దార్ద సరసన మరోసారి ఎంపికైంది హన్సిక. 'ఓ మై ఫ్రెండ్‌' సినిమాలో జంటగా కనిపించారు సిద్దార్థ్‌, హన్సిక. మళ్లీ ఈ జోడీని త్వరలోనే వెండి తెరపై చూడొచ్చు. సిద్దార్థ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. సుందర్‌ సి. దర్శకుడు. ప్రముఖ నటి ఖుష్బూ నిర్మాతగా వ్యవహరిస్తారు. తమిళ, తెలుగు భాషల్లో దీన్ని రూపొందిస్తారని తెలిసింది. ఇందులో హీరోయిన్ గా హన్సికను ఎంచుకున్నారు. ''వినోద ప్రధానమైన ప్రేమకథ ఇది. వాణిజ్య అంశాల్ని మేళవించాం'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌ తెలుగులో నందినిరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు.

  ఈ చిత్రంతో పాటు 'సింగమ్‌'(తెలుగులో యముడు) సీక్వెల్ లో హన్సిక హీరోయిన్ చేస్తోంది. ఈ చిత్రంలో హన్సిక స్కూల్‌ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనూష్క మెయిన్ హీరోయిన్.

  హన్సిక మాట్లాడుతూ ''చిన్నప్పుడు తరగతి గదిలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ యూనిఫామ్‌ వేసుకొని స్కూల్‌కెళ్లి చదువుకొంటే ఎంత బాగుంటుందో కదూ. స్కూల్‌ పిల్లలతో కలిసి తరగతిలో కూర్చొంటే భలే తమాషాగా అనిపించింది. పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయ''ని చెప్పింది. ఇంకో విషయమేమిటంటే... హన్సిక నిర్మాతగా మారబోతోందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం అంటోంది. ''ఎప్పట్నుంచో కంటున్న కల ఇది. తొందరలో సాకారమవుతుంద''ని చెప్పింది.

  English summary
  Move over Ileana and Nayanthara. Hansika will star alongside Karthi for the Venkat Prabhu directed film titled 'Biryani'. Confirming the news Hansika said, “Yes, I signed the film a couple of days back after I was impressed with Prabhu's script narration.” Though she was not forthcoming about her character in Biryani, a production source revealed that she would be playing a reporter in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X