»   » హన్సిక మందు కొట్టి , డ్రవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిందా?

హన్సిక మందు కొట్టి , డ్రవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వీకెండ్ వచ్చిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అతి సామాన్యం అన్నట్లుగా మారాయి. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సెలబ్రెటీలు ఎవరైనా ఈ కేసులో పట్టుబడితే మాత్రం మీడియా రచ్చ రచ్చ చేసేస్తుంది. ఇప్పుడు తమిళనాట హన్సిక ..డ్రంక్ అండ్ కేసులో ఇరుక్కుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజంగా ఆమె ఏమీ ఇలాంటి కేసులో ఇరుక్కోలేదు. కానీ మరి ఎలా ఈ న్యూస్ వచ్చిందంటారా

రీసెంట్ గా బోగన్ లో నటించిన హీరోయిన్ హన్సిక తాగేసి సెట్ కి వెళ్లింది. అందుకు కారణం హన్సికపై ఓ డ్రింకింగ్ సీన్ ఉందట. ఆ సీన్ పండటం కోసం ఈ అమ్మడు అలా తాగేసి వెళ్లిందట. ఇక ఆ సీన్ లో తాను జీవించేశానని చెబుతోంది.

అయితే హన్సిక చేసే రచ్చకి చుట్టు ప్రక్కల వారు కాస్త కంగారు పడ్డా.. సీన్ సూపర్భ్ గా రావడంతో దర్శక నిర్మాతలు మాత్రం ఫుల్ ఖుష్ అయ్యారట. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా హన్సిక డ్రింకింగ్ సీన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ అమ్మడు ఫుల్ ఖుష్ అయిందట. అయితే అదీ అబద్దమే అంటోంది హన్సిక.

ఇంతకు ముందు అడిగారు కానీ

ఇంతకు ముందు అడిగారు కానీ

హన్సిక మాట్లాడుతూ... నేను కేవలం భోగన్ చిత్రంలో అలాంటి సీన్ లో నటించాను అంతే. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాల్లో నటించమని అడిగినా కాదన్నాను. భోగన్ చిత్రంలో అలా ఎందుకు నటించాల్సి వచ్చిందంటే, కథకు చాలా అవసరం అయ్యింది గనుక.

పోలీసులకు దొరికిపోయి

పోలీసులకు దొరికిపోయి

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే నాకు మిలటరీ అధికారి అయిన నాన్న నిర్ణయించిన వివాహం చేసుకోవాలంటారు. అలా పెళ్లి నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తారు. ఆ నిశ్చితార్థం చెడ గొట్టాలని నేను టాస్మాక్‌ దుకాణంలోకి వెళ్లి 90 రూపాయలతో చీప్‌ సరకు కొనుక్కుని స్నేహితురాలి ఇంటికి వెళ్లి తాగి స్కూటర్‌లో ఇంటికి వెళ్లి నాన్నతో ధైర్యంగా ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పాలనుకుంటాను. అయితే మధ్యలో పోలీసులకు దొరికి పోవడంతో ప్లాన్ చిత్తై పోతుంది.

నేను వ్యతిరేకిని

నేను వ్యతిరేకిని

ఈ సన్నివేశంలో నటించడానికి పది రోజులు పట్టింది. దర్శకుడి సూచనల ప్రకారమే నటించినా, మందు కొట్టిన అమ్మాయిగా నటించడానికి అన్ని రోజులు పట్టింది. స్వతహాగా నేను మద్యం తాగడానికి వ్యతిరేకిని. అలా నటించడం కూడా మొదటి సారి అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఆ డైరక్టర్ తోనే

ఆ డైరక్టర్ తోనే

జయంరవి, హన్సిక జంటగా నటించిన మూడవ చిత్రం భోగన్ . ఇదే జంటతో ఇంతకు ముందు రొమియో జూలియట్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అదే విధంగా తనీఒరవన్ జయంరవి, అరవిందస్వామి కలిసి నటించి చిత్రం భోగన్

లేటు రిలీజ్

లేటు రిలీజ్

నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న రెండవ చిత్రం బోగన్ . డి.ఇమాన్ సంగీతాన్ని, సౌందర్‌రాజన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులై, లేటుగా రిలీజైంది

 అందుకే

అందుకే

గత డిసెంబర్‌లోనే చిత్రం విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.ఆ తరువాత జనవరి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.అదే తేదీన సూర్య నటించిన సీ-3(ఎస్‌-3 పేరు మారింది) చిత్రం తెరపైకి రానుండడంతో భోగన్ చిత్రాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదల చేసారు.

హ్యాపీనే

హ్యాపీనే

ఇటీవల సరైన విజయాలు లేక వెనకపడిపోయిన నటి హన్సిక ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇది మంచి విజయం సాధిస్తేనే తనకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమ్మడికి ఇక్కడ చేతిలో ఒక్క చిత్రం లేదన్నది గమనార్హం. ఈ ఏడాది తెలుగులో విడుదలైన లక్కున్నోడు చిత్రం హన్సికకు కాస్త నిరాశను మిగిల్చిన బోగన్ హిట్ తో ఈ అమ్మడు ఫుల్ హ్యపీగా ఉందట.

English summary
Surprisingly beauty Hansika revealed that she acted in a scene where she consumes cheap liquor and drives a scooty and finally get caught by police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu