»   » నాకు పెట్ నేమ్స్ అంటే చాలా ఇష్టం: హన్సిక

నాకు పెట్ నేమ్స్ అంటే చాలా ఇష్టం: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ తో 'కందిరీగ" చిత్రంలో నటిస్తున్న హన్సికకు తన అసలు పేరుకంటే మిగతావాళ్ళు పెట్టి పిలచే పేర్లంటే మక్కువ ఉన్నట్టుంది. తమిళంలో 'మాపిల్లై" చిత్రానికి షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ ఆమెని 'చిన్న కుష్బూ" పిలవటంతో తెగ మరిసిపోయింది కానీ, వివాహానికి ముందే శృంగారంలో అనుభవముండటం తప్పుకాదు అని పబ్లిక్ గా మాట్లాడి వివాదాల్లో చిక్కుకుందన్నది తెలియదు పాపం. కుష్బూ అనగానే అందరికీ అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు తాజాగా, 'ఎంగెయమ్ కాదల్?"అనే చిత్రంలో నటిస్తున్న హన్సికను అందులో ఆమె పాత్రైన 'లొలిత" అనే పేరుతో అందరూ పిలుస్తున్నారట! మరోసారి మురిసి పోతున్నది హన్సిక.

హంస స్వచ్ఛతకు మారు పేరు. 'హంసిక" అంటే బుజ్జి హంస. అంటే ఇంకా చాలా నిర్మలత్వం కలిగివున్నదని అర్థం. అంత మంచి పేరుని కాదని బయటివాళ్ళు పెట్టే పేర్లను ఇష్టపడుతోందంటే అది అమాయకత్వమనుకోవాలా లేకపోతే నిజజీవితంలో అమాయకంగా నటించే జాణతనమనుకోవవాలా? రెండవదైతే పరవాలేదు. చిత్రసీమ గాలి వంటికి బాగా పడ్డట్టే..!

English summary
Hansika has revealed that that unit members of her upcoming film in Tamil which is being directed by Prabhu Deva has given a 'cute' name to her i.e Lolita! She is very happy to get this name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu