Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆమె అందాలు వాళ్ల సొంతం...ఇక చెన్నయ్‌లోనే మకాం!
హీరోయిన్ హన్సిక కుష్భూ మాదిరి చెన్నయ్ లోనే సెటిల్ అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తను చైన్నై కేంద్రంగానే అన్ని భాషల చిత్రాల షూటింగ్‌లకు హాజరవుతానని ప్రకటించింది. తమిళంలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది హన్సిక. ఈ సుందరి నటిస్తోన్న అరడజను తమిళ చిత్రాలు ప్రస్తుతం నిర్మాణంలో వుండటం విశేషం.
బాగా కండపట్టి పిటపిటలాడే హీరోయిన్లంటే తెగ అభిమానం ప్రదర్శించే తమిళ తంబీలు ఈ భామను అనతి కాలంలోనే అందలం ఎక్కించారు. దీంతో హన్సికకు తమిళంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. అంతేకాదు ఈ అమ్మడి అభిమానులందరూ కలసి తమిళనాడులోని ఓ జిల్లాలో ఆమెకు ఓ కోవెల కట్టించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. దాంతో తమిళ ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతగా తను చైన్నైలో సెటిలయిపోదామని నిర్ణయించుకున్నానని హన్సిక చెబుతోంది.
తెలుగులో హన్సిక నటించిన ఒకటిరెండు చిత్రాలు మినహా మిగిలిన చిత్రాలు విజయం సాధించకపోయినా.. ఆమెకు డిమాండ్ తగ్గకపోగా.. ఆమె సొగసుల పరిమళాలు తమిళనాడుకు కూడా వ్యాపించి.. ఆ భాషలోనూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతుండడం విశేషం!
తాజాగా ఆమె తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఎంపికైంది. సింగమ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రంలో ఈమెను ఎంపిక చేసారు. హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం ఒకేసారి విడుదల చేయటనికి సన్నాహాలు చేస్తున్నారు. హన్సిక..నాగచైతన్య సరసన త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు సరసన 'దేనికైనా రెడీ' చిత్రంలో నటిస్తోంది.