»   » పేరు మార్చుకున్నా.. నన్నిక అలా పిలవొద్దు: హన్సిక

పేరు మార్చుకున్నా.. నన్నిక అలా పిలవొద్దు: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల హన్సిక తన సర్ నేమ్ 'మొత్వానీ"ని తీసేసుకుంది. దానికి కారణం ఓ న్యూమరాలజిస్టు చెప్పిన జ్యోతిషం అని తెలిసింది. ప్రతి అక్షరానికి ఓ సంఖ్య ఉంటుందని,అలాగే ఆమె అదృష్ట సంఖ్య '9"అనీ ఆ నిపుణుడు హన్సికతో చెప్పారట. కాబట్టి సఇంగ్లిష్‌లో హన్సిక పేరు గల అక్షరాల సంఖ్యలను కూడితే 9 సంఖ్య వస్తుందని చెప్పడంతో ఆమె ఇంటి పేరును తొలగించుకుంది.

ఇకనుంచి తనను 'హన్సిక" అని మాత్రమే పిలవాలని చెప్పుకొచ్చింది. 'హన్సిక మొత్వానీ"ని తన రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు చెప్పింది.ప్రస్తుతం హన్సిక తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో రామ్ సరసన కందిరీగ చిత్రం చేస్తోంది. అలాగే సిద్ధార్థ్‌తో 'ఓ మై ఫ్రెండ్‌" చిత్రాల్లో నటిస్తోంది. 'మాప్పిళ్లై"తో హిట్‌కొట్టాక తమిళనాట మూడో సినిమాగా 'వేళాయుధం" చేస్తోంది.

English summary
Hansika has removed her surname Motwani as per numerology. The actress requests everyone to call her as Hansika instead of Hansika Motwani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu