»   » త్రిష నయన్ లని ఇంత మాట అనేసింది: తప్ప తాగి నటించినా ఉపయోగం లేదని...

త్రిష నయన్ లని ఇంత మాట అనేసింది: తప్ప తాగి నటించినా ఉపయోగం లేదని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశముదురు వంటి తెలుగు సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించినప్పటికీ హన్సిక కి తెలుగులో కంటే తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు, స్టార్ డం ఎక్కువ లభించాయి. దేశముదురు సినిమా విడుదలై దశాబ్ద కాలం కావటంతో హన్సిక మోత్వానీ బాగా సీనియర్ కథానాయిక అనిపిస్తుంది తప్పితే అమ్మడి వయసు ఇప్పటికి 25 మాత్రమే. ఇప్పటికీ తమిళంలో విరివిగా, తెలుగులో అరుదుగా స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూనే వుంది.

కోలీవుడ్ లో ఒక అప్పడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి హన్సిక. విజయ్, సూర్య, ధనుష్, జయంరవి, ఆర్య ఇలా స్టార్‌ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ క్రెజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు కి ఆవకాశాలు తగ్గాయి. అయితే తెలుగులో చాలా కాలం తరువాత "లక్కున్నోడు" మూవీతో టాలీవుడ్ ని పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ ని చవి చూసింది.

ఇది ఇలా ఉంటే నయనతార, త్రిషల ఫై ఒక హాట్ కామెంట్ చేసి చర్చనీయాంశగా మారింది హన్సిక.హన్సిక కెరీర్ పీక్స్ లో కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో సడెన్ గా మార్కెట్ డౌన్ అయింది. తాజాగా తెలుగులో చేసిన లక్కున్నోడు సినిమా కూడా పరాజయం అయింది. ప్రస్తుతం తమిళంలో జయం రవి సరసన మరోసారి నటించిన బోగన్ ఈ శుక్రవారం విడుదల అయ్యింది.

Hansika’s comment on Trisha and Nayanthara

అయితే ఈ సినిమా యావరేజ్ అయినప్పటికీ హన్సిక పరిస్తితి మాత్రం అమరీ ఘోరంగా ఉందట. అసలు ఈ సినిమాలో హ్న్సిక ఉందన్న విషయం కూడా ఎవ్వరూ పట్టించుకోనట్టు గా. సినిమాలో అందరి కల్ళనీ తనవైపు తిప్పుకున్నాడు అరవింద స్వామి. అయితే ఇక్కడో ట్విస్టుందీ భోగాన్ అనే చిత్రంలో తప్ప తాగి రచ్చ చేసే సన్నివేశం ఒకటి హన్సిక చేయాల్సి రాగ హన్సిక ముందుగానే ప్రిపేర్ అయ్యి బాగా తప్ప తాగి సెట్స్ కి వచ్చి కెమెరా ముందు తనని తాను అదుపు చేసుకోలేని విధంగా ప్రవర్తించిందట.

ఆ ఫ్యూటేజ్ నే జాగ్రత్తగా ఎడిట్ చూపించుకుని సినిమాలో పెట్టేసాడట దర్శకుడు. నాచురల్ గా కనిపించాలనుకున్న హన్సిక తాపత్రయం మెచ్చుకోదగినదే అయినా, తన్ని ఉరువన్ వంటి సూపర్ హిట్ హీరో-విలన్ కాంబినేషన్ గా గుర్తింపు వున్నా జయం రవి-అరవింద్ స్వామి లు నటించిన భోగాన్ లో హన్సిక పడ్డ కష్టాన్ని ప్రేక్షకుడు గుర్తించలేకపోవటానికి అరవింద్ స్వామి తనదైన శైలిలో షో స్టీలర్ కావటమే కారణం. పైగా భోగాన్ చిత్రం విడుదల రోజు నుంచే మిక్స్డ్ టాక్ తో ఓపెన్ కావటంతో హన్సిక పై ఫోకస్ పడలేదు పాపం. దాంతో మరింతగా మడినట్టుంది ఆ కోపాన్ని త్రిష నయన తారలవైపు మళ్ళించింది.

బోగన్ సినిమా విడుదల సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలు అదే వెయిట్ తో ఆన్సర్ ఇచ్చిన హన్సిక....త్రిష, నయనతారలపై అతిపెద్ద కాంట్రవర్సీ కామెంట్ చేసింది. కొత్తవాళ్లతో నటిస్తారా అంటే స్క్రిప్ట్ నచ్చితే కచ్చితంగా చేస్తా అంటూ సమాధానం చెప్పిన హన్సిక.., నయనతార, త్రిష లాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తారా? అన్న ప్ర్శ్నకు మాత్రం 'నాకు వాళ్ళలా వయసైపోలేదు. ఆ వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తా' అంటూ తన హెడ్ వెయిట్ చూపించేసింది.

అంతే కాదు అక్కడితో కూడా ఆగకుండా ఆ ఇద్దరినీ వయసు మళ్ళిన వాళ్ళు అనేంత టైపులో తనకింకా పాతికేళ్లు కూడా నిండలేదని నయనతార, త్రిషలా థర్టీ ప్లస్ దాటిన తరువాత అలాంటి చిత్రాల గురించి ఆలోచిస్తానని సీనియర్ హీరోయిన్లపై చురకేసిందట. ఆ నోటా ఈ నోటా హన్సిక మాటలు విన్న నయన్, త్రిష ఇప్పుడు బాగానే ఉడికిపోతున్నారన్నది కోలీవుడ్ సమాచారం.

English summary
In a recent press interaction, Hansika was quizzed on why she donot do women-centric films like her competitors lady Superstar Nayanthara and Trisha. The Bogan actress stunned the crowd by replying that she is not that old enough to be doing such kind of films and roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu