»   » నేను చాలా షార్ప్: హన్సిక సొంత డబ్బా

నేను చాలా షార్ప్: హన్సిక సొంత డబ్బా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజానికి నేను చాలా షార్ప్...ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తా అంటోంది హన్సిక. ఈమె ధనుష్ హీరోగా చేస్తున్న మాపిళ్లై షూటింగ్ లో కలిసిన మీడియాతో మాట్లాడుతూ...తమిళ భాషతో ఇబ్బంది లేదా అంటే...తనకు తమిళం కొత్తగా అనిపించటం లేదని, తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడా అలాగే ఉందని అంది. అలాగే భాష వేరయినా సినిమా సినిమానే కదా. తెలుగు ఈజీగా నేర్చుకున్నానని అందులోనూ తాను చాలా షార్ప్ కావటం ప్లస్ అయిందని చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం తన చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవని, ఉన్నవి చర్చలు స్ధాయిలో ఉన్నాయని అంది. అయితే తాజాగా తాను రెండు హిందీ సినిమాలు కమిట్ అయ్యాయని ఆ బిజీలో త్వరలో పడతానని స్పష్టం చేసింది. అలాగే ఇక నుంచి తను గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలనే చెయ్యాలనుకుంటున్నాని అంది. అంతేగాక తన గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదు కానీ అందరితీ ప్రెండ్లీగా ఉంటాను. నా చుట్టూ ఉండే వాతావరణం బాగుండేలా చూసుకుంటాను. ముంబైలో చదువుకున్నాను కాబట్టి స్నేహితులు ఎక్కువే వాళ్ళను వీలు కుదిరినప్పుడల్లా కలుస్తూంటాను అంది హన్సిక.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu