»   » అందంగా కనిపించినవాళ్లపై అంతే: హన్సిక

అందంగా కనిపించినవాళ్లపై అంతే: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్త అందంగా కనిపించినవాళ్లపై ఏవో మాటలు విసురుతూనే ఉంటారు. ఇక రంగుల ప్రపంచంలో ఉండే మా మీదైతే వాటి జోరు మరీ ఎక్కువగా ఉంటుంది అంటోంది హన్సిక. ఆమె రెమ్యునేషన్ పెంచిందని, ఎవరితోనో డేటింగ్ చేస్తోందని రకరకాల విమర్శలు వస్తున్న నేపధ్యంలో వాటి గురించి మాట్లాడుతూ ఈ రకంగా చెప్పుకొచ్చింది. హన్సిక మాటల్లోనే...మనల్ని ఇతరులు విమర్శిస్తే తట్టుకోవచ్చు. అందులోని మంచి చెడుల్ని బేరీజు వేసుకుని మనల్ని మనం మెరుగు పరుచుకోవచ్చు. కానీ మనసులో ఏదో కోపం పెట్టుకుని కఠినంగా వ్యాఖ్యానిస్తే పట్టించుకోనవసరం లేదు. కొందరు సరదాకి అంటూనే మనసు నొచ్చుకునేలా మాట్లాడతారు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే మనసు పాడవుతుంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది. అందుకే ఎక్కడ విషయాలు అక్కడ మరిచిపోవడం అలవాటు చేసుకున్నాను అని చెప్పింది. ప్రస్తుతం హన్సిక...ధనుష్ హీరోగా తమిళంలో మా ఫిళ్ళై అనే చిత్రంలో చేస్తోంది. మనీషా కొయరాల ఈ చిత్రంలో హన్సికకు తల్లిగా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu