»   » అందుకే రక్తపరీక్ష చేయించుకున్నా: హన్సిక

అందుకే రక్తపరీక్ష చేయించుకున్నా: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగు,తమిళ భాషల్లో హాట్ హీరోయిన్ గా వెలుగుతున్న హన్సిక రీసెంట్ గా రక్త పరీక్ష చేయించుకుంది. ఈ విషయం తెలియడంతో ఆమె స్నేహితులు, అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందారు.

ఏం జరిగిందంటూ ఫోన్స్, ట్వీట్స్ తో ఆమెను ముంచెత్తారు. మరికొంతమందైతే కాస్త ముందుకు వెళ్లి ...విశ్రాంతి తీసుకోమని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు సలహాయిచ్చారు. దాంతో తాను ఎందుకు రక్త పరీక్ష చేయించుకుందో ట్విట్టర్ సాక్షిగా వివరణ ఇచ్చింది. ఆమె ఏం చెప్పిందో మీరూ చూడండి.

అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణయిచ్చింది.

తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించింది.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో ఓప్పిగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది.

ఇక హన్సిక తాజా చిత్రం విశేషాలకు వస్తే.... పీటీఎస్‌ ఫిలిమ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై జీవా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పోక్కిరి రాజా'. ఇందులో శిబిరాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హన్సిక హీరోయిన్. మానస మరో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మనోబాల, చిత్రాలక్ష్మణన్‌, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.

Hansika tweet about her blood test

'తమిళుక్కు ఎన్‌ ఒండ్రై అళుత్తవుం' సినిమా ద్వారా కోలీవుడ్‌లో దర్శకుడిగా అడుగుపెట్టి విజయాన్ని అందుకున్న రామ్‌ప్రకాశ్‌ రాయప్ప ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. వర్షాల్లోనూ చిత్రీకరణ జరిపినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

సినిమా గురించి నిర్మాణవర్గాలు మాట్లాడుతూ.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ముఖ్యమైన సన్నివేశాలను ప్రస్తుతం పుదుచ్చేరిలో తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే చెన్నైలో చిత్రీకరణ ఆరంభం కానుంది. డి.ఇమాన్‌ సంగీతంలోని పాటలు అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నాయి. సినిమాటోగ్రఫీ: ఆంజనేయులు, ఎడిటింగ్‌: సాబు.

English summary
Hansika tweeted: I can cry the loudest when it comes 2 taking a blood test!Thank god for my mothers patiences!Squeezed the poor thing!🙈🙈#earlymorncrybaby lol
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu