»   » నిజమే..ఆ హీరో,నేనూ ప్రేమించుకుంటున్నాం :హన్సిక

నిజమే..ఆ హీరో,నేనూ ప్రేమించుకుంటున్నాం :హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : 'అవును... మేం ప్రేమలో ఉన్నాం' అంటూ మొత్తానికి తన లవ్ ఎఫైర్ ని రివిల్ చేసేసింది హన్సిక. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామనే మాటను కుండబద్ధలు కొట్టింది శింబు-హన్సిక జంట. హన్సికను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని నటుడు శింబు ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఆ వెంటనే శింబు కూడా 'అవును... నేను హన్సికతోనే ఉంటున్నా. అయితే మా పెళ్లిని మాత్రం పెద్దలు నిర్ణయిస్తారు. అంతవరకు మా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగొంచొద్దు' అంటూ ట్వీట్‌ చేశాడు.

  హీరోయిన్ హన్సిక గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తమిళ హీరో శింబుతో అమ్మడు కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. చాటుమాటుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం గురించి తమిళ పత్రికలు కోడైకూస్తున్నాయి. హన్సిక మాత్రం 'మా మధ్య అలాంటి బంధమేదీ లేద'ని చెబుతూ వచ్చింది.

  ఇక తమ ప్రేమ సంగతి దాచినా లాభం లేదనుకుందో ఏమో కానీ... తాము ప్రేమించుకొంటున్న మాట నిజమే అని ట్విట్టర్‌లో తేల్చిచెప్పింది. 'నా వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ఎక్కువగా వింటున్నాను. ఇక మా ప్రేమ గురించి ఇప్పుడు స్పష్టం చేస్తున్నాను. అవును... నేను శింబుని ప్రేమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా నా వ్యక్తిగత విషయాలు చెప్పను' అని ట్వీట్‌ చేసింది హన్సిక.

  శింబు హీరోగా ప్రస్తుతం 'వాలు', 'వేట్త్టెమన్నన్‌' చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండింటిలోనూ హన్సిక హీరోియన్గా నటిస్తోంది. 'వాలు' సినిమాలో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమపక్షుల్లా విహరిస్తూ డేటింగ్‌ చేస్తున్న వీరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అయితే కొన్నిరోజుల క్రితం 'శింబును ప్రేమించట్లేద'ని హన్సిక తేల్చిచెప్పింది. కానీ శనివారం ఉదయం 6.00 గంటలకు తన ట్విట్టర్‌లో 'శింబును ప్రేమిస్తున్నాను'అని పేర్కొంది.

  ''నా వ్యక్తిగత విషయాల గురించి పలురకాల వదంతులు వస్తున్నాయి. వాటిని సరిచేయాలనుకుంటున్నా. అవును.. నేను ఎస్టీఆర్‌(శింబు) ప్రేమించుకుంటున్న విషయం నిజమే. ఇది నా వ్యక్తిగత విషయం. ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేద''ని ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు. దీనిపై ట్విట్టర్‌లోనే శింబు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ''అవును. హన్సికను ప్రేమిస్తున్నది నిజమే. మా ఇద్దరి ఇంట్లోనూ పెళ్లి గురించి మాట్లాడనున్నాం. మా వ్యక్తిగత విషయాలను గౌరవించి.. ఎవరూ ఇందులో జోక్యం చేసుకోవద్దు''అని పేర్కొన్నాడు శింబు.

  English summary
  Hansika tweeted, “Been hearing to many rumours abt my personal life, so jus wana clear.yes!I'm seeing Str:)n hence I wouldnt like 2talk abt my personal life.” On the other hand the Simbu also wrote about his love life. “Yes I'm am with hansika and right now she is doing really good and marriage will b decided by our family ... Hope u will respect our privacy,” he said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more