Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సూర్య బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
నేడు (జూలై 23) సూర్య బర్త్ డే. సూర్య కేవలం తమిళ నాట మాత్రమే కాదు.. తెలుగులోనూ స్టార్ హీరోనే. మొదటి నుంచి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ మెప్పించాడు. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ చెరగని ముద్ర వేశాడు. ఇప్పటికీ సూర్య సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే గతకొన్నేళ్లుగా సూర్య సినిమాలు బోల్తా కొడుతుండటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశ చెందారు.
చివరగా వచ్చిన ఎన్‌జీకే, బందోబస్త్ చిత్రాలు దారుణ ఫలితాన్ని చవిచూశాయి. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా (సూరారై పొట్రూ) అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసింది. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చాడు.

ఆకాశం నీ హద్దురా చిత్రంలోంచి సూర్య పాడిన పాటను రిలీజ్ చేశారు. అంతే కాకుండా విలక్షణ దర్శకుడు వెట్రీమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతోన్న కొత్త ప్రాజెక్ట్ విశేషాలను ప్రకటించారు. కళైపులి ఎస్ థాను నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వాడివసాల్ (తమిళ టైటిల్) అంటూ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మొత్తానికి సూర్య బర్త్ డేకు ఫ్యాన్స్‌కు రెండు సర్ ప్రైజ్‌లు రావడంతో ఆనందంలో తేలిపోతున్నారు.