»   » నా తీరని కోరిక అదే...హ్యాపీ గర్ల్ తమన్నా

నా తీరని కోరిక అదే...హ్యాపీ గర్ల్ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిటైర్‌ అయ్యే లోపు ఆ కోరిక నెరవేరుతుందనే అనుకుంటున్నాను. అందుకు తగ్గ పాత్ర లభిస్తే...నా పారితోషికాన్ని తగ్గించుకునైనా సరే ఆ పాత్రలో జీవించి నా కోరిక తీర్చుకుంటాను' అంటోంది తమన్నా. ఇంతకీ ఆమెకు అంతలా తీరని కోరికగా మిగిలిందేమిటీ అంటే...నేషనల్‌ అవార్డు తీసుకోవాలనేది ఆమె చిరకాల వాంఛ అంటోంది. అలాగే. "నాకు అవార్డులంటే మొదట్నుంచీ భలే ఇష్టం. వేదికపైకి వెల్లి ఎక్కి అందరి అభినందనల మధ్య గొప్పగా అవార్డు అందుకుంటుంటే...ఆ ఆనందమే వేరు అంటోంది. ఇక తన గ్లామర్ సీక్రెట్ చెబుతూ..."మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాను. ఉదయం ఫ్రూట్‌ జ్యూస్‌ మాత్రమే తీసుకుంటా. ఇక మధ్యాహ్నం ఒక పుల్కా, రాత్రి ఒక పుల్కా తింటాను. ఇదీ నా మెనూ! నటిగా పదికాలాల పాటు అందరి అభిమానం పొందాలంటే..కడుపు మాడ్చుకోక తప్పదు. కొన్ని కావాలంటే..కొన్ని వదులుకోవాలి మరి' అంటోంది తమన్నా. ఆమె ఇలాగే గ్లామర్ మెయింటైన్ చెయ్యాలని ఆమె చిరకాల వాంఛ అయిన నేషనల్ అవార్డుని తొందరలోనే పొందాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu