»   » స్పైడర్‌కు మరో షాక్.. దెబ్బ కొట్టిన మసాలా సినిమా

స్పైడర్‌కు మరో షాక్.. దెబ్బ కొట్టిన మసాలా సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu's Spyder teaser creates record

దసరా కానుకగా వచ్చిన స్పైడర్ చిత్రం తమిళనాడులో భారీ అంచనాల మధ్య విడుదలైంది. దర్శకుడు మురుగదాస్, ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై తొలుత డివైడ్ టాక్ రావడం స్పైడర్ ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకొని కలెక్షన్ల పరంగా నిలదొక్కుకున్నది. అయితే స్పైడర్ చిత్రంపై ఓ చిన్న సినిమా దెబ్బ పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోలీవుడ్‌లోకి మహేశ్ ఎంట్రీ

కోలీవుడ్‌లోకి మహేశ్ ఎంట్రీ

స్పైడర్ చిత్రం ద్వారా తొలిసారి నేరుగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేశ్‌బాబు. దసరా పండుగ సందర్భంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. సెప్టెంబర్ చివరివారంలో చెన్నై పట్టణంలో నంబర్ వన్‌ చిత్రంగా నిలిచింది. కానీ అక్టోబర్ మొదటి వారానికి స్పైడర్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

మూడో స్థానంలో స్పైడర్

మూడో స్థానంలో స్పైడర్

ప్రస్తుతం స్పైడర్ చిత్రం చెన్నైలో నంబర్ 3 స్థానంలో కొనసాగుతున్నది. ప్రస్తుతం చిన్న చిత్రంగా వచ్చిన హరహర మహా దేవకి చిత్రం నంబర్ 1 స్థానంలో నిలువడం గమనార్హం. విజయ్ సేతుపతి నటించిన కురప్పన్ రెండో స్థానంలో నిలువడం విశేషం.

హరహర మహా దేవకి ఆదరణ

హరహర మహా దేవకి ఆదరణ

తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హరహర మహా దేవకి చిత్రం ప్రస్తుతం విశేష ప్రేక్షకాదరణ చూరగొంటున్నది. హరహర మహా దేవకి చిత్రంలో నిక్కి గర్లానీ, గౌతమ్ కార్తీక్ హీరోహీరోయిన్లుగా నటించారు. అడల్ట్ కంటెట్ పుష్కలంగా ఉన్న మసాలా చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తున్నది. దాంతో ఈ చిత్రం చెన్నైలో టాప్ 5 స్థానాల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నది.

జీఎస్టీ బిల్లుపై నిరసన

జీఎస్టీ బిల్లుపై నిరసన

తమిళనాడులో జీఎస్టీ బిల్లును నిరసిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ ఆందోళన చేస్తున్నది. అక్టోబర్ ఆరో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేసింది. ఈ వ్యవహారం హరహర మహా దేవకి చిత్రానికి కలిసివచ్చింది. కొత్త చిత్రాలు రాకపోవడంతో ఈ చిన్న చిత్రానికి ఎదురేలేకుండా పోయిందనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

English summary
The Mahesh Babu starred, SPYDER hit theatres in last week of September. It was one of the biggest films of this year as the movie released in Tamil and Telugu. The film during the Dussehra week reigned at the box office, taking on the number 1 position. however, things have changed in the first week of October. Mahesh Babu’s SPYDER has slided down to Number 3 position while an adult entertainer Hara Hara Devaki has taken on the Number 1 position.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu