»   » ప్రియుడి సినిమాలోనయనతార ఐటెం సాంగ్..!?

ప్రియుడి సినిమాలోనయనతార ఐటెం సాంగ్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ 'దబాంగ్" చిత్రంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి నటనకు ఎంత స్పందన వచ్చిందో..మలైకా అరోరా వేసిన ఐటెం సాంగ్ స్టెప్పులకు కుర్రకారు నుంచి అంతే స్పందన వచ్చింది ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా ధరణి దర్శకత్వంలో 'ఒస్తి" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో రిచాగంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తోంది. మలైకా అరోరా వేసిన ఐటెంసాంగ్ స్టెప్పులకి ఏమాత్రం తీసి పోనిరీతిలో తమిళంలో కూడా ఓ పేరున్న హీరోయిన్ తో ఈ సాంగ్ ని షూట్ చేయాలనే ఆలోచనలో ఆ చిత్ర నిర్మాత ఉన్నాడట.

ముందు ఈ సాంగ్ లో శ్రియ నటించనున్నట్టు వార్తలొచ్చాయి. ఎందుకో ఆమెను తప్పించి నయనతారతో ఐటెంసాంగ్ ని చేయాలని చిత్ర నిర్మాత భావిస్తున్నాడట. శ్రియకంటే ముందు..నయనతారకు ఈ సాంగ్ లో నటించాలని హీరో శింబు కోరాడట. అయితే తాను ఇక సినిమాలు చేయనని ప్రకటించి..తర్వాత మనసు మార్చుకున్న నయనతార ఐటం సాంగ్..అందునా తన మాజీ ప్రియుడు సినిమాకు చేస్తుందా..ప్రభు చేయనిస్తాడా అన్నది అనుమానమే..

English summary
If sources are to be believed Nayantara will be seen doing the hot item song in south remake of Dabangg.If you think Nayantara has decided to quit films after Shri Rama Rajyam then you will be surprised by this news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu