twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి హిట్ చిత్రం కాపీ...'లింగా'పై కోర్టుకు

    By Srikanya
    |

    చెన్నె: 'లింగా' సినిమా తొలి నాటి నుంచీ ఏదో విధంగా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికి ఇద్దరు ఈ చిత్రం కథ తమదే అంటూ కోర్టుకు ఎక్కగా ఇప్పుడు ఆ చిత్రం తెలుగులో చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం కథను పోలి ఉందంటూ కోర్టుకు ఎక్కారు. తమ దగ్గర తమిళ రీమేక్ రైట్స్ ఉన్నాయి కాబట్టి చిత్రం రిలీజ్ ఆపు చెయ్యాలని కోరారు. అయితే కోర్టు దాన్ని కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే...

    విడుదలపై మధ్యంతర స్టే విధించాలన్న పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. రజనీకాంత్‌ నటించిన 'లింగా' చిత్రంపై మధ్యంతర స్టే కోరుతూ బాలాజీ స్టుడియో ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో తెలుగులో చిరంజీవి, సోనాలి బింద్రె ముఖ్య తారాగణంగా తెరకెక్కిన 'ఇంద్ర' సినిమాను తమిళంలో రీమేక్‌ చేయడానికి హక్కులు పొందినట్టు, ఆ చిత్ర కథకు దగ్గరగా 'లింగా' ఉందని ఆ పిటిషన్‌లో తెలిపింది. 'లింగా' విడుదలైతే తమకు నష్టం కలుగుతుందని, దీని దృష్ట్యా ఆ సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధించాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి లింగ కథను నిర్ధరించాలని కూడా ఆ పిటిషన్‌లో కోరారు.

    ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చిన నేపథ్యంలో 'ఇంద్ర' సినిమా కథతో తమ చిత్ర కథకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల కేసు కొట్టివేయాలని కౌంటర్‌ అఫిడవిట్‌ను లింగా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దాఖలు చేశారు. రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు లింగాపై స్టే విధించడానికి నిరాకరించింది.

    HC refuses to stay ‘Lingaa’ release, adjourns case to Dec. 12

    చిత్రం విషయానికి వస్తే..

    'లింగ' కథ చాలా గొప్పదని సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'లింగ' చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'లింగ' చిత్ర సబ్జెక్ట్‌ చాలా పెద్దదని, రైలు పోరాట దృశ్యాలు, బ్రిడ్జ్‌ కట్టే దృశ్యాల్లో వందల మందిని పెట్టి సినిమా తీయడం గొప్ప విషయమన్నారు. ఈ ఫలితం మొత్తం దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌లకు దక్కుతుందన్నారు.

    సాబుశిరిల్‌, రత్నవేల్‌, ఏఆర్‌ రెహమాన్‌, అనుష్క, సోనాక్షి సిన్హా లాంటి బిజీ తారలను పెట్టుకుని ఆర్నెల్లో సినిమా తీయడం నిజంగా చాలా కష్టమన్నారు. ఈ చిత్ర కథనం తమదేనంటూ నలుగురు కేసు పెట్టారని అయితే ఇది రచయిత పొన్నుకుమారన్‌దే అన్నారు. కథనం అందంగా ఉంటుందన్నారు.

    కొన్ని పోరాట దృశ్యాలు తాను సొంతంగా చేయలేదని, కానీ హీరోయిన్లతో పాటలన్నీ చేశానని చమత్కరించారు. చాలా కష్టపడి రజనీకాంత్‌ను అందంగా చూపించానని మేకప్‌మేన్‌ అన్నారంటూ చిరునవ్వులు చిందించారు. ఈ సందర్భంగా 'బాహుబలి' చిత్రం గురించి మాట్లాడుతూ... అది చాలా గొప్ప సినిమా అని, దర్శకుడు రాజమౌళి నిజంగా ఓ గొప్ప దర్శకుడని కితాబిచ్చారు.

    తన తర్వాత చిత్రం ఏమిటని నిర్మాత అల్లు అరవింద్‌ అడిగారని అయితే మంచి కథ, కథనం దొరికిన వెంటనే తాను చేస్తానని చెప్పానన్నారు. అదే విధంగా చిరంజీవితో త్వరగా ఓ సినిమా చేయాలని అరవింద్‌కు సూచించినట్లు రజనీకాంత్‌ తెలిపారు.

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    When the civil suit by M/s Balaji Studios Private Limited, which claimed that the storyline of ‘Lingaa’ was in line with that of Telugu film ‘Indra’, came up for hearing, Justice R Subbiah refused to stay the release of ‘Linga’ and adjourned the matter to December 12. Claiming that the storyline, dialogues, scene sequence and characters of ‘Lingaa’ was the infringement of ‘Indra’, for which it had the remake rights in Tamil, the petitioner company submitted that it was planning to remake the Telugu film in Tamil and the basic work for it was going on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X