For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంత దారుణమా :హీరో అజిత్ కు హార్ట్ స్ట్రోక్ అంటూ....

  By Srikanya
  |

  చెన్నై : అజిత్ కు తమిళనాట రోజు రోజుకూ పెరుగుతున్న ప్యాన్ ఫాలోయింగ్ ని చూసి తట్టుకోలేని ఓ వర్గం ఎలాగోలా వారి అభిమానులను ఏడిపించటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా అజిత్ ఆరోగ్యంపై రూమర్ ని వదిలి ఆనందపడింది. ట్విట్టర్ లో అజిత్ కు హార్ట్ స్ట్రోక్ అనే మాట వైరస్ లా ప్రయాణించింది. అభిమానులంతా ఆందోళనపడ్డారు. ఈ రూమర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను దాటి, వెబ్ మీడియాకు ఆ తర్వాత న్యూస్ ఛానెల్స్ కు పాకింది. చివరకు అజిత్ మేనజర్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన సిట్యువేషన్ వచ్చింది.

  ఇక ఈ మెసేజ్ ఇంతలా పాపులర్ అవటానికి కారణం...అది అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర నుంచి వచ్చినట్లుగా ఉండటమే. అంటే కొందరు కావాలని అజిత్ మేనేజర్ సురేష్ ...పేజీలో ఈ మ్యాటర్ ఉన్నట్లు ఫొటో షాప్ లో డిజైన్ చేసి వదిలారు. దాంతో ఎవరికీ అనుమానం రాలేదు. టెక్నాలిజీని ఇలా దుర్వినియోగపరిచి అందరినీ ఇబ్బందిపెట్టినందుకు తెలియనివారిని అందరూ తిట్టుకుంటున్నారు.

  ఇక అజిత్ మేనేజర్ మాట్లాడుతూ...ఇదే విషయాన్ని వివరిస్తూ...అజిత్ ఆరోగ్యం బాగుందని, ఎలాంటి స మస్యా లేదని, రూమర్స్ నమ్మవద్దని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఆ ట్వీట్ ని అజిత్ అభిమానులు తమ వాల్ మీద ఉంచి , రిలాక్స్ అవుతున్నారు. ఆ ట్వీట్ ని మీరూ చూడండి.

  ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్‌ థ్రిల్అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  'వేదలం' కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా అజిత్‌తో కలసి వర్క్ చేస్తుండటంతో అనిరుధ్ తెగ సంబరపడిపోతున్నాడట. అంతేకాదు అక్టోబర్ 16న తన పుట్టినరోజు సందర్భంగా అజిత్‌పై ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు అనిరుధ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఈ లోగా 'వేదలం' చిత్రంలో ఓ పాటను విడుదల చేసారు.

  ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Heart Attack Hoax: Thala Ajith Targeted, His Manager Calls Them 'Ugly Minds'

  ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

  అయితే ఈ గెటప్ చూసినవారు దాదాపు పదమూడేళ్ల క్రితం అజిత్ నటించిన రెడ్ సినిమాలోని గెటప్ ను పోలి ఉందంటున్నారు.... ఇటీవల అజిత్ చిత్రాలన్నీ తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగులో డబ్ కానుంది. గతంలో అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన వీరమ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నవంబర్-10న వస్తున్న వేదాలం.. ఆ అంచనాలను అందుకుని అజిత్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

  English summary
  Though Thala Ajith's growing popularity is being celebrated and cherished by his fans and well wishers, few miscreants, allegedly resented by his flourishing career in Kollywood, are finding innovative ways to create panic among his fans. The latest one is a heart attack hoax. Rumours pertaining to Ajith's health spread like wild fire not so long ago, when a shocking message in the social networking site Twitter suggested that the Yennai Arindhaal star was admitted in a hospital after he suffered a massive heart attack.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X