»   » రామ్ చరణ్ చిత్రం టైటిల్ 'హాయ్ రామ్ చరణ్' ఖరారు

రామ్ చరణ్ చిత్రం టైటిల్ 'హాయ్ రామ్ చరణ్' ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ చిత్రానికి 'హాయ్ రామ్ చరణ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేసి విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇంతకీ ఏ చిత్రానికి ఈ టైటిల్ పెట్టారని ఆలోచనలో పడ్డారా ... ఆ చిత్రం మరేదో కాదు 'ఆరెంజ్' చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ కి ఈ టైటిల్ ని ఖరారు చేసారు. అయితే తెలుగులో ఈ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో తమిళంలో ఏ రకంగా వర్కవుట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'మగధీర' చిత్రం తమిళంలో మావీరన్ టైటిల్ తో విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించటంతో ఇప్పుడు ఆయన చిత్రాలన్నీ వరసగా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ మధ్యన రామ్ చరణ్,పూరీ జగన్ కాంబినేషన్ లో రూపొందిన 'చిరుత' చిత్రం తమిళంలో డబ్బింగ్ చేసారు. 'చిరుత్తై పులి' టైటిల్ తో ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసారు. అయితే డబ్బింగ్ నిర్మాతలకు ఎదురుదెబ్బ తగలింది. మొత్తం 19 స్క్రీన్లలో అక్కడ విడుదలైన 'చిరుత్తై పులి' చిత్రం బ్యాడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా శాటిలైట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డబ్బింగ్ స్పీడు తగ్గలేదు.

రామ్ చరణ్ ...రచ్చ చిత్రం కూడా'రగలై'గా విడుదలై మంచి మంచి టాకే తెచ్చుకుంది. కానీ పెద్గగా కలెక్టు చేయలేకపోయింది. అందుకు కారణం రామ్ చరణ్ మగధీర రేంజిలో ఆచిత్రం లేక పోవడమే అని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఈ తాజా చిత్రం ఆరెంజ్ ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందటంతో అక్కడ బాగానే బిజినెస్ అవుతుందని బావిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హ్యారీష్ జైరాజ్ సంగీతం అందించటం,హ్యారీస్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు.

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన ఆరెంజ్ చిత్రాన్ని నిర్మాత నాగబాబు..ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. మలేషియా, ఆస్ట్రేలియా, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో షాజన్‌ పదమ్ ‌సీ సెకెండ్ హీరోయిన్ గా చేసింది. షాజన్‌ పదమ్ ‌సీ సినిమా ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది. సినిమా ప్లాప్ అయినప్పటికీ పాటలు ఇక్కడ హిట్ అయ్యాయి. మరి తమిళంలో ఏమి జరగనుందో చూడాలి.

English summary

 Ram charan's ‘Orange’ is being dubbed as ‘Hai ram charan’ into Tamil and above still is the first look of the movie. The movie could not do well at tollywood box office. Genelia has paired up with Cherry in ‘Orange’. Shahzan Padamsi was seen as the second heroine of this movie. Harris Jairaj composed the most melodious and romantic tunes for this movie. Bommarillu Bhaskar directed this movie. The movie was produced by Nagababu on Anjana Productions.
Please Wait while comments are loading...