»   » నాగచైతన్య, అనుష్కల పెళ్లి పుకారు పుట్టించిన హీరో..!?

నాగచైతన్య, అనుష్కల పెళ్లి పుకారు పుట్టించిన హీరో..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క, నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారంటూ రెండు రోజుల క్రితం టాలీవుడ్ ని ఊపేసిన గాసిప్స్ అసలు తమిళ పత్రికలలో ఎలా పుట్టాయన్న దాని మీద ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంక్వయిర్ చేస్తే ఈ గాసిప్స్ ను ప్రచారంలోకి తీసుకురావడంలో తమిళ హీరో శింబు హస్తం వుందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్, దీక్షాసేథ్ నటించిన మల్టీస్టారర్ మూవీని తమిళంలో రీమేక్ చేయడం జరింగింది. అందులో హీరోగా శింబు నటించగా అనుష్క అదే పాత్రను పోషించిన విషయం తెలిసింది. ఆ సినిమా షూటింగ్ నుండి శింబు, అనుష్క పై మనుస్సు పడ్డాడని, దాని తర్వాత సినిమాలో కూడా ఆఫర్ ఇస్తే అనుష్క తిరస్కరించిందని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి..

శింబు గతంలో అనుష్క మీద మనసు పారేసుకున్నాడనీ, ఆమెకు దగ్గరవ్వాలని తెగ ప్రయత్నించాడనీ, అయితే అనుష్క అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టిందనీ అంటున్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న శింబు ఈ గాసిప్ ను క్రియేట్ చేసి తమిళ మీడియాకు వదిలాడని చెప్పుకుంటున్నారు. అది నిజమేననుకున్న తమిళ మీడియా నాగచైతన్యను అనుష్కతో ముడిపెట్టి రాసేసింది. అదీ అసలు సంగతి!

English summary
Sources say that Tamil hero Simbu is the man behind the gossips in Tamil news papers about the alleged marriage of Anushka and Naga Chaitanya. It is known that Simbu lusts Anushka madly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu