»   » హీరో విశాల్‌ చిత్రాలపై బ్యాన్ పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్

హీరో విశాల్‌ చిత్రాలపై బ్యాన్ పెట్టిన డిస్ట్రిబ్యూటర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పందెం కోడి, ప్రేమ చదరంగం, భరణి, భయ్యా వంటి చిత్రాలతో తెలుగు,తమిళ భాషల్లో తనకంటూ ప్రేక్షకులను ఏర్పాటు చేసుకున్న నటుడు విశాల్. ప్రస్తుతం ఆయనకు తమిళంలో గడ్డుకాలం ఎదురైంది. ఆయన చిత్రాలను కొనుగోలు చేయరాదని డిస్ట్రిబ్యూటర్ల సంఘం తీర్మానం చేసింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం సంయుక్త సమావేశం చెన్నైలోని దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ విశాల్‌ సొంత నిర్మాణ సంస్థ జీకే కార్పొరేషన్‌ డిస్ట్రిబ్యూటర్లకు చాలా బాకీ చెల్లించాల్సి ఉం దన్నారు. ఈ విషయమై పలుమార్లు ఆ సంస్థ నిర్వాహకులతో సంప్రదించినాసరైన స్పందన రాలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని అందజేయలేదన్నారు. ఇకపై విశాల్‌ నటించే చిత్రాలను పంపిణీ చేయరాదని తీర్మానం చేశామని వెల్లడిం చారు. ఈ సమావేశంలో కార్యదర్శి జోసఫ్‌ ప్రాన్సిస్‌, సురేష్ ‌తో పాటు పలు వురు డిస్టిబ్యూటర్లు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే విశాల్ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద వరసగా డిజాస్టర్ ఫలితాలను చవిచూస్తున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కి బాకీలు మిగిలాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్..ప్రభుదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu