For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫైట్ లో తాడు తెగి...హీరో విశాల్ కు గాయాలు

  By Srikanya
  |

  చెన్నై: తమిళ,తెలుగు చిత్రాల హీరో విశాల్ కు ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతూండగా తాడు తెగి,ఇరవై అడుగుల ఎత్తు మీద నుంచి పడి...గాయాలు అయ్యాయి. చిత్రంలోని ఫైట్ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా తాడు తెగిపోవడంతో విశాల్ రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ప్రాధమిక చికిత్స అనంతరం కోయిబత్తూరు తరలించారు. ఒక కాలు బెణికిందని, మరో కాలు ఎముక చిట్లిందని చెప్తున్నారు. ఇప్పుడు అతడిని ఊటీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా విశాలే. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ అంబాల. హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.

  చిత్రం విషయానికి వస్తే...

  సుందర్‌.సి దర్శకత్వంలో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఆంబల'. హన్సిక కథానాయిక. తొలిసారిగా వీరిద్దరూ జతకడుతున్నారు. విశాల్‌ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, కుష్బూ సారథ్యంలోని అవనీ ఫిలిం కార్పొరేషన్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విశాల్‌ను చాక్లెట్‌బాయ్‌గా చూపే ప్రయత్నం చేశారు సుందర్‌.సి.

  Hero Vishal Injured On Set

  విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రంలో ఒక పాటకు స్వరాలందించిన.. 'హిప్‌హాప్‌ తమిళా' ఫేం ఆది సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో వైభవ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కుంభకోణంలో ఇటీవల తొలి షెడ్యూల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం వూటీలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సింగిల్‌ ట్రాక్‌ను రానున్న ఐదో తేదీన విడుదల చేయనున్నారు. నేటి యువతకు తగ్గట్టుగా ఈ పాటకు స్వరాలందించారట ఆది.

  సుందర్‌.సి, విశాల్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే తెరకెక్కిన చిత్రం విడుదలకు నోచుకోని నేపథ్యంలో తాజాగా మరో చిత్రం రూపుదిద్దుకోవటం అంతటా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలం పాటు నటుడిగా కొనసాగిన సుందర్‌.సి మళ్లీ మెగాఫోన్‌ పట్టుకుని కొన్ని హిట్‌ చిత్రాలు రూపొందించారు. విశాల్‌ హీరోగా, వరలక్ష్మి, అంజలి ఆయనకు జంటగా 'మదగజరాజా'ను రూపొందించారు. చిత్రీకరణ పూర్తెనా.. అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

  ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఆంబళ' అనే చిత్రం రూపొందనుంది. విశాల్‌కు జంటగా హన్సిక ఆడిపాడనుండగా.. ప్రభు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చుతారు. విశాల్‌కే చెందిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరి ఈ సినిమా నిర్మింస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

  విశాల్‌ మాట్లాడుతూ '' నాన్న, అన్నయ్య స్థాపించిన నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ నేను నిర్మాతగా మారానంటే కారణం అదే. ప్రతీ హీరోకీ ఓ మలుపు ఉంటుంది. ఆ మలుపు దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ చెప్పినప్పుడు నా సినీ జీవితానికి మలుపునిచ్చే చిత్రమిదే అవుతుందనిపించింది. ''అన్నారు.

  తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. నిర్మాతగా మారడంతో ఆ సినిమా ఆలస్యమైంది. శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు సినిమాని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాము అన్నారు.

  English summary
  Vishal has been apparently filming a stunt sequence for his next film Aambala and fell off from a rope hanging at a height of 20 feet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X