»   » ఆ సినిమా కోసం దెబ్బలు తిన్నాను : హీరోయిన్ అంజలి

ఆ సినిమా కోసం దెబ్బలు తిన్నాను : హీరోయిన్ అంజలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌మిళ్ లో హీరోయిన్ గా స‌క్సెస్ అయిన మ‌న తెలుగు అమ్మాయిలో అంజ‌లి ఒక‌రు. తెలుగులో రిలీజైన‌ జ‌ర్నీ.. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు , గీతాంజలి వంటి చిత్రాల‌తో తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ‌.తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పుట్టిపెరిగిన అంజలికి కోలీవుడ్ కలిసొచ్చింది.

చిన్నప్పటి సంగతులు

చిన్నప్పటి సంగతులు

అలా అక్కడే ఆమె సెటిల్ అయిపోయింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ క్రేజ్ అంతంత మాత్రమే.. చాలామంది అంజలి తమిళ్ అమ్మాయే అనుకున్నారు మొదట్లో ఎక్కువ గా తమిళ సిన్మాల్లో చేయటమే దానికి కారణం అయ్యుండొచ్చు గానీ అయితే ఈ మధ్య తన చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకున్న అంజలి సినిమా చూడటానికి వెళ్ళిన తనకి ఎంత చక్కగా "సన్మానం" జరిగిందో చెప్పింది....

ఇరవయ్యేళ్ళ కింద

ఇరవయ్యేళ్ళ కింద

అమ్మాయిలు కాలేజ్ ఎగ్గొట్టి సినిమా చూడటానికి వెళ్ళటం అంటే ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోరు గానీ ఓ దాదాపు ఇరవయ్యేళ్ళ కింద అంటే అంత వీజీ అయిన విషయమేం కాదు. అప్పటి అనుభవాన్ని ఇదిగో ఇలా చెప్పింది.... ‘‘టెన్త్ క్లాస్‌ బాగా చదివేప్పటికి నా కళ్లు నెత్తిమీదకు వచ్చాయి. అంటే మా బ్యాచ్‌లో నేను ఫస్ట్‌ క్లాస్‌ అన్నమాట.

నువ్వే కావాలి

నువ్వే కావాలి

అప్పట్లో చదివేదాన్ని. దానికి మించి అల్లరి చేసే దాన్ని. హైస్కూల్‌ వరకు నేనెప్పుడూ బంక్‌ కొట్టలేదు. ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి. ఆ రోజుల్లో ‘నువ్వే కావాలి' సినిమా విడుదలైంది. యూత్‌లో ఆ సినిమాకు బాగా క్రేజ్‌ వచ్చేసింది. దాంతో దాన్ని ఎలాగైనా చూడాలని, ఒక రోజు కాలేజీకి బంక్‌కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్‌కు ఎవరూ చూడరనే ధైర్యంతో ఫ్రెండ్స్‌తో కలసి వెళ్లాను.

నన్ను చితక్కొట్టేశారు

నన్ను చితక్కొట్టేశారు

నేను ఇంటికి వచ్చే లోపలే ఆ న్యూస్‌ బయటకు వచ్చేసింది. దాంతో మావాళ్లు నన్ను చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాలేజీకి బంక్‌కొట్టి సినిమాకు గానీ, షికారుకు గానీ వెళ్లలేదు. ఆ రోజులు తలచుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో!'' అంటూ చెప్పుకొచ్చింది.

English summary
Jurny, Seetammavakitloa Sirimallechettu feam Anjali who is in a Live in Relation with tamil Hero jai Sared some chiledhod Memories
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu