అందుకే అంజలిని కోర్టుకు లాగుతున్నారు...
చెన్నై : దర్శకుడు కలంజియం దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విషయమై గురువారం కోర్టులో హాజరు కావాల్సిన నటి అంజలి డుమ్మా కొట్టింది. తన పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారంటూ నటి అంజలి ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలు తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని, నటి అంజలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ దర్శకుడు కలంజియం సైదాపేట కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు గురువారం విచారణకు వచ్చింది. అయితే అంజలి హాజరుకాకపోవడంతో విచారణను రానున్న 19వ తేదీకి వాయిదా వేశారు.
జూన్ 19న కోర్టు ఆదేశాల మేరకు హాజరు కాక పోతే...ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కళంజియం తరుపు న్యాయవాది అంటున్నారు.


Click it and Unblock the Notifications












