»   » 'టెన్త్ క్లాస్' చిత్రం హీరోయిన్ శరణ్య కిడ్నాప్...తల్లి కంప్లైంట్

'టెన్త్ క్లాస్' చిత్రం హీరోయిన్ శరణ్య కిడ్నాప్...తల్లి కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెన్త్ క్లాస్ హీరోయిన్ శరణ్య గుర్తుందా..అదే ప్రేమిస్తే చిత్రంలో హీరోయిన్ సంధ్య స్నేహితురాలుగా కనిపిస్తుందీ ఆమే. తమిళంలో జయం రవి వంటి హీరోల సరసన చేసిన ఈ ముధ్దుగుమ్మ కిడ్నాప్ అయిపోయిందని ఆమె తల్లి మంజుల చెన్నై పోలీసులకు రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంయింట్ లో తన కూతురు బోయ్ ప్రెండ్ ఆమెను బలవంతంగా తీసుకెళ్ళిపోయాడని, ఆమెను రక్షించి తీసుకొచ్చి తనకు అప్పచెప్పవలిసిందని కోరింది. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేస్తూండగా శరణ్య మీడియా ముందుకు వచ్చి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టప్రకారమే తన బోయ్ ప్రెండ్ తో తానూ బయిటకు వెళ్ళిపోయి ఉంటున్నానని,అతనితోనే కంటిన్యూ అవదలుచుకున్నానని అంది. తన తల్లి వద్దకు వెళ్ళటానికి ఇష్టం లేదని అంది. మొత్తానికి శరణ్య సినిమాల్లోనే కాక నిజజీవితంలోనూ తన ప్రేమను పండించుకోవటానికి ధైర్యంగా నిర్ణయం తీసుకుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu