»   » ఎనభై కోట్ల బిజెనెస్ ...తమన్నా టెన్షన్

ఎనభై కోట్ల బిజెనెస్ ...తమన్నా టెన్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాపీ గర్ల్ తమన్నా ఇప్పుడు పూర్తి టెన్షన్ లో ఉందని చెప్తున్నారు. ఆమె తమిళ పరిశ్రమలో వరస ఆఫర్స్ ఒప్పుకుని సినిమాలు చేసేసింది. అవి పియా, తల్లంగడి, సుర చిత్రాలు. ఈ మూడు వరసగా నెల గ్యాప్ లో రిలీజు డేట్స్ పెట్టుకున్నాయి. తమన్నా వీటిలో హీరోయిన్ చేసినా...హీరోలు మాత్రం వేరే. విజయ్, కార్తీ, జయం రవి ఈ చిత్రాల్లో హీరోలుగా చేసారు. వారు తమ చిత్రాల మధ్య ఆ మాత్రం గ్యాప్ చాలనుకుంటున్నారు. దాంతో తమన్నా చిత్రాలు తమన్నాకే పోటీగా మారే ప్రమాదం కనపడుతోంది. అందులోనూ మూడింటిలోనూ ఒకే హీరోయిన్ గా తాను ఉండటం ప్రేక్షకులకు రుచిస్తుందా అన్న భయం కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఈ మూడు చిత్రాలు బిజెనెస్ దాదాపు ఎనభై కోట్ల వరకూ జరిగింది. దాంతో అంత బిజెనెస్ తన చిత్రాలతో జరగటం..ఆ విషయం పత్రికల్లో రాయటం ఆమెకు టెన్షన్ కలిగిస్తోంది. అలాగే వీటి రిజల్ట్ ని బట్టి కూడా తన కెరీర్ ఆధారపడి ఉంటుందని భావిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె తమిళ్ లో చేసిన చిత్రాలు కూడా ఏవీ హిట్టు అయి ఆమెకు పేరు తేలేదు. దాంతో ఈ చిత్రాలనే నమ్ముకుంది తమన్నా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu