»   » బోండాల్లా ఉన్నాయని ఏడిపించేవారు: నమిత

బోండాల్లా ఉన్నాయని ఏడిపించేవారు: నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

నమితకు మొదటనుంచి ఏమీ దాచుకోకుండా చూపెట్టడమే కాకుండా మనస్సులోనూ ఏమీ దాచుకోకుండా చెప్పటమూ అలవాటే. అలాగే ఆమె తన చిననాటి అనుభూతులను నెమరువేసుకుంటూ...నన్ను చూసిన వారు బుగ్గలు గిల్లి బోండాల్లా ఉన్నాయని ఆటపట్టించేవారు. అయితే మా ఆంటీ, అంకుల్ మాత్రం 'రసగుల్ల' అని ముద్దుగా పిలిచేవారు. ఇక అమ్మా..నాన్నా నెలకోసారి నా ముద్దు పేరు మార్చేసేవారు. అలాగే నేను చిన్నప్పుడు చాలా అల్లరి దాన్ని..ఆ వయస్సులో నాకు చెట్లు ఎక్కడమంటే మహా సరదా. ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటే అలిగి చెట్టుమీద కూర్చునేదాన్ని. తాయిలం ఇస్తేగానీ కిందికి దిగేదాన్ని కాదు. ఎంత ఏడుపు ముఖంతో ఉన్నా కెమెరాను చూస్తే వెంటనే నవ్వేసేదాన్ని. ఎందుకంటే నాకు ఫొటోలంటే చాలా ఇష్టం. అందుకే నా చిన్నప్పటి ఫొటోలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. అన్నట్టు అలిగి చెట్టుమీద కూర్చున్నప్పుడు తీసిన ఫొటోలు కూడా ఉన్నాయి‌..అంటోంది నమిత. అంతా బాగానే ఉందిగానీ ఇప్పుడు ఆమె రూపాన్ని చూసి ఏ ముద్దు పేర్లతో ఇండస్ట్రీలో పిలుస్తున్నారనే విషయం మాత్రం చెప్పటానికి నిరాకరించింది. బిల్లాతో చిరకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా దేశద్రోహి చిత్రంలోనూ బాలకృష్ణ సరసన సింహా చిత్రంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu