»   » నాకు నచ్చే మొగాడు ఎలా ఉండాలంటే...త్రిష

నాకు నచ్చే మొగాడు ఎలా ఉండాలంటే...త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేను కట్టుకోబోయేవాడు ఇలానే ఉండాలనే ఆలోచనలైతే ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ మన వివాహ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం. అన్ని విషయాల్లో స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్య్రం ఉండాలన్నది నా నిశ్చిత అభిప్రాయం. భార్య మీద అధికారం చలాయించే తరహా మగాళ్లంటే నాకు ఇష్టం వుండదు. అలాంటి వారంటే నాకు మహా చిరాకు. ఆంటూ చెప్పుకొచ్చింది త్రిష..ఆమెను మీ కలల రాకుమారుడు ఎలా వుండాలని కోరుకుంటున్నారు అనే విషయాన్ని అడిగితే ఇలా చెప్తోంది. అలాగే...నా అభిరుచులను గౌరవిస్తూ, నన్ను అర్థం చేసుకునేవాడినే నేను చేసుకుంటాను. అయినా నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులదే తుది నిర్ణయం. అంతేకాదు నా పై అమ్మ ప్రభావం ఎక్కువ. ఏ నిర్ణయమైనా నన్నే తీసుకోమంటుంది. అది తప్పో ఒప్పో తరువాత చెబుతుంది. ఆమె సలహా తీసుకోకుండా ఏ పనీచేయను. ఒక విధంగా నాకు స్నేహితులు ఎంత మంది ఉన్నా బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రం అమ్మే' అని చెప్పారు త్రిష.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu