twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూ కమల్‌హాసన్ వివరణ

    By Srikanya
    |

    చెన్నై : ''విశ్వరూపం చిత్రాన్ని ఏ మతానికీ, దేశానికీ వ్యతిరేకంగా రూపొందించలేదు. నేను గాంధేయవాదిని'' అని చెప్పారు కమల్‌హాసన్‌. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం'. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని చెన్నైలో విడుదల చేశారు. దీన్ని ఆరో త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. దీంట్లో తీవ్రవాదానికి సంబంధించిన కారణాలు, విరుగుడును ప్రస్తావించాను. హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిస్తున్నందున విడుదల తేదీని ఖరారు చేయలేకపోతున్నాను'' అన్నారు. తీవ్రవాదానికి పరిష్కారం చెప్పారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''అందుకు విరుగుడుగా వారి చేతికి దువ్వెనిచ్చా. ఎలా దువ్వుకుంటారన్నది వారిష్టం'' అన్నారు.

    విశ్వనటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వరూపం'. 'ఆరో త్రీడీ' సాంకేతికతతో రూపొందించడం విశేషం. ప్రపంచంలోనే ఈ తరహా పరిజ్ఞానంతో వస్తున్న రెండో సినిమా ఇది. ఇదిలా ఉండగా బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆడియో విడుదల జరపాలనుకోగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఆరో 3డీతో రూపొందించిన ట్రైలర్‌ను కమల్‌ బుధవారం విడుదల చేశారు. కార్యక్రమానికి నగరంలోని సత్యం థియేటర్‌ వేదికైంది.

    ఈ రోజు నా పుట్టినరోజు. మదురై, చెన్నై, కోవై నగరాల్లో హెలికాప్టర్‌లో వెళ్లి ఆడియోను విడుదల చేసి సంక్షేమ పథకాలను పంపిణీ చేయాలని భావించా. వాతావరణం అనుకూలించని కారణంగా ప్రయాణాన్ని రద్దు చేశా. అభిమానుల కోసం ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నా. విశ్వరూపం చిత్రానికి 'యు/ఏ' సర్టిఫికేట్‌ లభించింది. సినిమాను ఏ మతానికీ, ఏ దేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించలేదు. హాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. మొత్తం 3 వేల ప్రింట్లల్లో జనం ముందుకు రానుంది. అందుకే పనులు మరింత పెరుగుతున్నాయి. ఆసియాలోనే తొలిసారిగా ఆరో త్రీడీ టెక్నాలజీతో తీసుకొస్తున్నాం. ఈ సాంకేతికతను రాష్ట్రంలోని 30 థియేటర్లలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

    పుట్టినరోజు సందర్భంగా కమల్‌హాసన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కమల్‌ బుధవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని శుభాకాంక్షలు అందుకున్నారు. పలువురు నటీనటులు కూడా ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలచందర్‌ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి తగ్గట్టు.. అత్యాధునిక సినీ ప్రపంచంలోని సాంకేతిక హంగులను ఎప్పటికప్పుడు తెలుసుకునే సత్తా కమల్‌కు ఉంది. తమిళ పరిశ్రమలో అతిపెద్ద స్థానం సంపాదించుకున్నారు. త్వరలో హాలీవుడ్‌లోనూ ప్రతిభ చాటుకుంటారు అన్నారు.

    English summary
    
 “I am not against any religion and I respect humanity in general. I celebrate the spirit of mankind, not festivals in particular. So I would not disrespect anyone. My film is also like that. As a civic society we have to find out why terrorism exists at all and analyze if we can find a solution to it. Viswaroopam makes a statement though I don’t know if you can call it a solution.” Says Kamal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X