For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ తో సెమీ న్యూడ్ గా అబద్దం : తమన్నా,'బాహుబలి' నిర్మాతతో ఎగ్రిమెంట్

  By Srikanya
  |

  చెన్నై: తమన్నా కు ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరు తెచ్చి పెట్టిన చిత్రం ఏమిటీ అంటే ఖచ్చితంగా బాహుబలి చిత్రమే అని చెప్పాలి. ఆ చిత్రంలో ఓ సన్నివేశం వివాదాస్పదమైంది. ఆ సన్నివేశం మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. ఓ రొమాంటిక్ డ్యూయిట్ లో తమన్నాను చూపిన విధానం వివాదం రేపింది.

  ఈ సినిమా రిలీజ్ అయినపుడు కొన్ని స్వచ్చంద సంస్థలు కలిసి ఈ సినిమాలో ప్రబాస్ తమన్నాను ఒకరకమైన స్థితిలోకి పంపుతాడు, అదికూడా రేప్ లాంటిదే అని వాదించారు. కాని అది నిలబడలేదు.

  సినిమాలో యువతకు నచ్చిన రొమాంటిక్ సీన్ ఏదంటే..... శివుడు, అవంతిక మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం. ఆపై వచ్చే పచ్చబొట్టేసిన సాంగ్. అయితే ఈ సీన్‌పై మహిళా జర్నలిస్టు అన్నా వెట్టికాడ్ రాసిన వ్యాసం ఇపుడు చర్చనీయాంశం అయింది. ఆ విషయమై ఇప్పుడు తమన్నా వివరణ ఇచ్చింది.

  సాంగ్ షూటింగ్ సమయంలో తాను సెమీ న్యూడ్ గా నటించాననటం అబద్దం అని తమన్నా అంది. ఆమె మాట్లాడుతూ.... "మీరు తెరపై చూసింది చూసినట్లుగా తీయలేదు. షూటింగ్ లో వేరే విధంగా ఉంది. అదో సినిమాటెక్ బ్యూటీగా చిత్రీకరించారు. అంతేకాని సెమీ న్యూడ్ గా ప్రబాస్ ఎదురుగా నిలబడ లేదు అంది. అలాగే బాహుబలి 2 గురించి మరిన్ని వివరాలు ఆమె తెయిచేసింది. అవన్నీ మీరు స్లైడ్ షో లో చదవచ్చు.

  'ది రేప్ ఆఫ్ అవంతిక' పేరుతో ప్రముఖ ఆంగ్లపత్రికలో రాసిన ఆ వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ను మలిచిన తీరును తప్పుబట్టారు. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమ‌తి లేకుండా ఆమె జుట్టు ముడివిప్పి... ఆమె వ‌స్ర్తాలు తొల‌గించి...అడవిలో దొరికే సహజ రంగులతో ఆమెకు లిప్ స్టిక్ అద్దడం, కాటుక పెట్టడంపై విమర్శలు గుప్పించారు.

  శివుడి పాత్ర అవంతిక పాత్ర పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది. బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలో ఓ అపరిచితుడు, ఓ అమ్మాయిని ఇలా చేసి...ఆమెను ముగ్గులో దించి ప్రేమ‌లో ప‌డేయ‌డం చూస్తే యువ‌త‌కు ఎలాంటి సందేశం ఇచ్చిన‌ట్ల‌వుతుద‌ని ఆమె త‌న వ్యాసంలో ప్ర‌శ్నించారు.

  స్లైడ్ షోలో బాహుబలి 2 గురించి తమన్నా చెప్పిన విశేషాలు..

  ఒత్తిడి ఉంది..

  ఒత్తిడి ఉంది..

  ‘బాహుబలి: ది బిగినింగ్‌' విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఒత్తిడి ఉండేది. కానీ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' విషయంలో చిత్ర యూనిట్ చాలా ప్రశాంతంగా ఉన్నారు.

  అపూర్వ ఆదరణ

  అపూర్వ ఆదరణ

  తొలి భాగానికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన అపూర్వ ఆదరణే దానికి కారణం. అందుకే తాజా చిత్రం కోసం ఎలాంటి భయాలు లేకుండా ఉత్సాహంగా పనిచేస్తున్నాం.

  కొత్తగా

  కొత్తగా

  ‘బాహుబలి: ది బిగినింగ్‌'తో పోలిస్తే రెండో భాగంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది.

  యోధురాలిగా

  యోధురాలిగా

  తొలి భాగంలో నేను ఓ మామూలు అమ్మాయిగానే ఎక్కువ కనిపిస్తాను. అందులో నాకు పాటలు, డ్యాన్సులు ఉన్నాయి. కానీ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌'లో యోధురాలిగా పోరాటాలు చేస్తాను.

  శిక్షణ తీసుకున్నా

  శిక్షణ తీసుకున్నా

  కత్తియుద్ధం, గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాను. దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను.

  అందరూ అదే

  అందరూ అదే

  ‘బాహుబలి' ప్రస్తావన రాగానే అందరూ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అని అడుగుతున్నారు.

  ఒప్పందం ఉంది

  ఒప్పందం ఉంది

  దానికి నేను సమాధానం చెప్పలేను. ఈ సినిమా కథకు సంబంధించిన విషయాలు వెల్లడించకూడదని ఒప్పందం ఉంది.

  రివీల్ చేయకూడదు

  రివీల్ చేయకూడదు

  రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అంతకు మించి నేను రివీల్ చేయకూడదు

  మించుతుంది

  మించుతుంది

  తొలి భాగాన్ని మించిపోయేలా భారీస్థాయిలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌ ఉంటుంది.

  ఆసక్తికరంగా

  ఆసక్తికరంగా

  కథ, కథనాల పరంగానూ రెండో భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

  రిలీజ్

  రిలీజ్

  బాహుబలి 2 వచ్చే ఏప్రిల్‌ 28న ఈ చిత్రం విడుదల కానుంది.

  ఆశలన్నీ

  ఆశలన్నీ

  ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' గురించి అవంతిక పాత్రపైనే తమన్నా ఆశలు పెట్టుకుంది

  English summary
  Explaining Tamanna stand about the said song and her controversial appearance in the film, Tamannaah has said that when the song was shot, she didn’t actually stand semi-nude in front of Prabhas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X