»   » హీరో కత్తిపట్టి వందమందిని నరికే సినిమాలే తీస్తా

హీరో కత్తిపట్టి వందమందిని నరికే సినిమాలే తీస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

76 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాయాలంటే హీరో కత్తిపట్టి వందమందిని నరికేయాల్సి వచ్చింది. అందుకే ఇకపై నేను అలాంటి చిత్రాలే చేయటానికి నిర్ణయించుకున్నాను అంటున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన తాజా చిత్రం మిరపకాయ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే 'ఈ అబ్బాయి చాలా మంచోడు' అంటే జనాలకు నచ్చదు. 'ఇడియట్‌', 'పోకిరి' అంటేనే చూస్తారు. ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి అన్నారు.

బోలెడంత డబ్బు సంపాదించుకోవాలి, కార్లు కొనుక్కోవాలి...అంటూ పరిశ్రమలోకి ఎవరూ అడుగుపెట్టరు. తమకున్న ప్రతిభని అత్యున్నత స్థానంలో బయటపెట్టడానికే వస్తారు. అయితే ఇక్కడ కొన్ని సూత్రాలకు కట్టుబడి పని చేయాలి. వాణిజ్య విలువల్ని పట్టించుకోవాలి. దాన్ని నేను గుర్తించలేదు. అందుకే 'షాక్‌' తగిలింది. 'మిరపకాయ్‌'లో ప్రేక్షకులకు ఏం కావాలో అది అందించాను. ఇప్పుడు విజయాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నారు హరీష్‌ శంకర్‌.

అలాగే హీరో పైసాకి పనికిరాని ఏ ఎదవకీ ప్రేమించే అర్హత లేదంటే జనాలకి నచ్చలేదు. హీరో ఎంత పనికిరానివాడైనా హీరోయిన్‌ అతన్ని ప్రేమిస్తేనే జనం చూస్తారు. 'నేనింతే', 'శంభో శివ శంభో' విభిన్నంగా ఉంటాయి. కానీ ఆ సినిమాలకు రావల్సినంత స్పందన రాలేదు. ప్రేక్షకులకు నచ్చిందే తీయాలి. కొత్తదనం అంటూ ప్రయోగాలు చేయకూడదు. నేను చేయను కూడా' అని స్పష్టం చేసారు. మొత్తానికి హరీష్ శంకర్ తాను గతంలో తీసిన 'షాక్‌' చిత్రం ప్రయోగం అని ఫిక్సయ్యరన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu