»   » ఊహాగానాలు వద్దు.. జరిగింది ఇదే.. సంఘమిత్రపై శృతిహాసన్ క్లారిటీ..

ఊహాగానాలు వద్దు.. జరిగింది ఇదే.. సంఘమిత్రపై శృతిహాసన్ క్లారిటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రం నుంచి తప్పుకోవడం వెనుక నివారించలేని కొన్ని పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే ఆ చిత్రం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నాను అని అందాల తార శృతిహాసన్ క్లారిటీ ఇచ్చారు. సంఘమిత్ర నుంచి తప్పుకోవడం వెనుక అనేక రూమర్లు, గాసిప్స్, వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వాటికి తెర దించుతూ శృతిహాసన్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో అనవసరమైన ఊహాగానాలు చేయవద్దు అని మీడియాను ఆమె కోరింది. హిందీలో రూపొందిన బహెన్ హోగి తేరి చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించింది.

సంఘమిత్ర గురించి తెలుసు..

సంఘమిత్ర గురించి తెలుసు..

సంఘమిత్ర కథ, నా క్యారెక్టర్ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. అయితే సరైన విధంగా స్క్రిప్టు లేకుండా, షూటింగ్ సంబంధించిన క్యాలెండర్ లేకుండా సినిమా కోసం రెండేళ్లు వేచి చూడటమంటే కెరీర్‌ను పణంగా పట్టినట్టే. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకొన్నాను అని శృతిహాసన్ పేర్కొన్నారు.

చరిత్రలో నిలువడం ఖాయం..

చరిత్రలో నిలువడం ఖాయం..

సంఘమిత్ర చిత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఆ సినిమా షూటింగ్, స్క్రిప్ట్‌ గురించి నాకు కొన్ని సందేహాలు తలెత్తాయి. అందుకే ఆ ప్రాజెక్ట్ చేయడం సరికాదు అని భావించాను. అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించడం భావ్యం కాదు అని శృతి చెప్పింది.

ప్రకటన సారాంశం ఇదే..

ప్రకటన సారాంశం ఇదే..

సంఘమిత్ర నుంచి తప్పుకోవాలని శృతిహాసన్ నిర్ణయం తీసుకొన్నారు. చాలా భారీ ప్రాజెక్ట్. రెండేళ్లపాటు అంకితభావం చూపాల్సిన సినిమా అది. కానీ స్క్రిప్ట్, సినిమా ప్లానింగ్ సరిగా లేనందునే ఆమె తప్పుకోవాలని అనుకొన్నారు అని శృతిహాసన్ తరఫున ఓ ప్రకటన వెలువడింది.

శృతి శిక్షణ వీడియోలు హల్చల్..

శృతి శిక్షణ వీడియోలు హల్చల్..

సంఘమిత్ర సినిమా ప్రకటన వెలువడిన వెంటనే శృతిహాసన్ చాలా చురుకుగా వ్యవహరించింది. కత్తిసాము, ఇతర యుద్ధ విద్యలను శిక్షణ పొందుతున్నట్టు వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేశాయి. ఆ తర్వాత 70వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఫస్ట్‌లుక్, ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడంలో శృతిహాసన్ ప్రముఖంగా కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో శృతిహాసన్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే వారెందుకు తప్పుకోలేదు..

అయితే వారెందుకు తప్పుకోలేదు..

ఇదిలా ఉండగా, స్క్రిప్ట్, షూటింగ్ షెడ్యూల్, ఇతర అంశాలపై క్లారిటీ లేకుండానే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ డైరెక్టర్ సాబు సిరిల్, ఇతర సాంకేతిక నిపుణులు ఎలా కమిట్ అయ్యారు. శృతిహాసన్ చెప్పిన కారణమే నిజమైతే వారు ఎందుకు తప్పుకోలేదు అనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఎనిమిదో శతాబ్దానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న సంఘమిత్ర చిత్రానికి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
“It is a project that I am no longer a part of so, I wouldn’t like to elaborate on it further,” Shruti said here while promoting her forthcoming romantic comedy film Behen Hogi Teri.“I like to have a firm and clear idea of a script and a character -- that’s how I work. And if that doesn’t happen, then I move on to the next things. But, I wish the team all the very best. I am sure it is going to be fantastic,” she added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu