»   » షారూక్ అంటె తెగ మక్కువ: 'సూపర్' బ్రేవో

షారూక్ అంటె తెగ మక్కువ: 'సూపర్' బ్రేవో

Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు డ్వేన్ బ్రేవో తనకు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. తమిళ చిత్రం 'ఉలా'లో ఒక పాటలో నటించేందుకు బ్రేవో చెన్నైకి వచ్చారు. చిత్ర యూనిట్‌తో ఆడిపాడారు. ఈ సందర్భంగా షారుక్‌ఖాన్‌పై తనకు గల అభిమానాన్ని తెలియజేశారు.

తాను కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్‌కి పెద్ద అభిమానిని చెప్పుకున్నారు. కోల్‌కతా నైట్ రైజర్స్ యజమానిగా ఉన్నందుకు కాదని, తాను షారుక్ ఖాన్ నటించిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాన్ని చూసిన తర్వాత అతనికి వీరాభిమానికి మారిపోయినట్లు బ్రేవో తెలిపారు. ఆ చిత్రంలోని పాటలంటే కూడా తనకు ఇష్టమని చెప్పారు.

తమిళ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ బయటపడింది. తన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు రవిచంద్రన్ అశ్విన్, మురళి విజయ్‌లకు తన షూటింగ్ విశేషాలను తెలిపానని చెప్పారు. వారు ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ వివరాలను బ్రేవో తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు.

రాజన్ మాధవ్ దర్శకత్వం వహించిన 'ఉలా' చిత్రంలో బ్రేవో నటించిన పాటను ప్రమోషనల్ సాంగ్‌గా ఉపయోగించనున్నారు. సాజన్ మాధవ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్, ఆజ్మల్ అమీర్, రాధిక ఆప్టే, గాయత్రిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
He's currently shaking a leg for a Tamil film titled Ula. And, West Indian cricketer and Chennai Super Kings all-rounder Dwayne Bravo seems to be taking inspiration from none other than the Baadshah of Bollywood, Shah Rukh Khan, for the number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu