»   » నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, ఇదంతా వాళ్ళ పనే: హీరోయిన్ వరలక్ష్మి

నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, ఇదంతా వాళ్ళ పనే: హీరోయిన్ వరలక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్ అయినట్లు సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. #VaralaxmiGotKidnapped అనే హాష్ ట్యాగ్ తో వరలక్ష్మికి సంబంధించిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై వరలక్ష్మి కూడా స్పందించక పోవడం, చెన్నైలో ఆమె ఎవరికీ అందుబాటులో లేక పోవడంతో అంతా కంగారు పడ్డారు.

మీడియాలో వార్తలు రావడంతో వరలక్ష్మి వెంటనే స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రం ప్రచారం నిమిత్తం ఈ ఫొటోను తమ చిత్ర యూనిట్ పోస్ట్ చేసిందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరలక్ష్మి స్పష్టం చేసింది.

ట్విట్టర్లో విమర్శలు

అయితే సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అంటూ ట్విట్టర్లో ఆమెపై విమర్శల వర్శం వెల్లువెత్తాయి. దీంతో వరలక్ష్మి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పి విమర్శలకు దిగిన వారిని చల్లబరిచే ప్రయత్నం చేసారు.

నాకు ఏపాపం తెలియదు

ఇలాంటి ప్రమోషన్ గురించి నాకేమీ తెలియదు. నాకు తెలియకుండానే సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ఈ ప్రచారం చేసారు. ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను. కేంద్ర న్యాయశాఖ మంత్రికి ‘సేవ్ శక్తి' పిటీషన్ ఇచ్చేందుకు వచ్చాను. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నాను అంటూ వరలక్ష్మి తెలిపారు.

ఆమెకు ఏమీ తెలియదు

వరలక్ష్మికి ఏమీ తెలియదు. ఆమెను సర్పైజ్ చేయడానికే ఇలా చేసామని చిత్ర యూనిట్ సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు.

సేవ్ శక్తి

సేవ్ శక్తి

నటి వరలక్ష్మి ఇటీవలే ‘సేవ్ శక్తి' అనే కాంపెయిన్ ప్రారంభించారు. లైంగిక వేధింపులు ఎదురైనపుడు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని, అందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని, అదే సమయంలో వారికి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె పోరాటం చేస్తున్నారు.

English summary
"I'm absolutely fine.. thank u for ur concern..it's a part of our movie promotion.. announcement at 6pm..!! I wasn't aware of this promotion as I'm in delhi representing my Save shakti petition to the Law ministry..Sorry for the trouble..!!" varalakshmi sarathkumar‏ said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu