»   » 'సింగం-3'కీ సిద్దం అంటున్నాడు

'సింగం-3'కీ సిద్దం అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : కథ దొరికితే 'సింగం-3'లోనూ నటిస్తానని స్టార్ హీరో సూర్య అంటున్నాడు. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన 'సింగం', 'సింగం-2' చక్కని విజయాలు సాధించాయి. తమిళనాడు కోవైలో 'సింగం-2' ప్రదర్శితమవుతున్న థియేటర్‌ను సూర్య సందర్శించాడు. ప్రేక్షకులతో ముచ్చటించాడు.

సూర్య మాట్లాడుతూ... 'సింగం' నా కెరీర్‌లో తీపిగుర్తుగా నిలిచిపోయింది. పోలీసు పాత్రల్ని బాగా ఎంజాయ్‌ చేశాను. యూనిఫాం ఒంటిమీదకు చేరగానే నాలో తెలియని హుందాతనం, గంభీరం, నిజాయతీ చోటుచేసుకున్నాయి. అభిమానులు కూడా 'సింగం' నుంచి నన్ను వేరుచేసి చూడలేకపోతున్నారు. మంచి కథ దొరికితే 'సింగం-3'లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

సూర్య నటించిన 'సింగం' చిత్రం ఈ రోజు తెలుగులో విడుదలైంది. గతంలో తెలుగులో విడుదలైన 'యముడు' సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. అంచనాలకు తగిన విధంగా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ''ఇంతకు ముందు వచ్చిన 'యముడు', ఇప్పుడు విడుదలైన 'సింగం' సినిమాల్లో ఏది బాగుంది అంటే నేను చెప్పలేను. మీరు చిన్నప్పుడు అందంగా ఉన్నారా.. పెద్దయ్యాక బాగున్నారా అంటే చెప్పగలరా.. ఇదీ అంతే. యముడులో నరసింహం ఓ ఎస్సైగా జీవితం మొదలుపెడతాడు.. ఆ తర్వాత ఉన్నత స్థానాలకు చేరతాడు. అందులో కేవలం రాష్ట్రంలో జరిగే ఘటనలను అడ్డుకుంటాడు. 'సింగం'లో మన దేశంలో జరిగే విదేశీ మాఫియా కార్యకలాపాల్ని అడ్డుకుంటాడు. ఏ సినిమాకి ఆ సినిమానే బాగున్నాయి. రెండింటిలోనూ వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి'' అన్నారు.


ఈ చిత్ర నిర్మాణ సంస్థ: ప్రిన్స్‌ పిక్చర్స్‌, స్టూడియో గ్రీన్‌, నటీనటులు: సూర్య, అనుష్క, హన్సిక, వివేక్‌, సంతానం, రాధా రవి, నాజర్‌, విజయ్‌కుమార్‌, ముఖేష్‌ రుషి, కె.విశ్వనాథ్‌ తదితరులు, ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాత: ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌, దర్శకత్వం: హరి.

English summary
Surya returns as a righteous young cop in "Singam 2", which is the sequel to Tamil blockbuster "Singam". "I would love to do the third part of "Singam" provided my director has the patience and time to work again. The excitement with with which we have worked for this film has given me the confidence to work again if there is a third instalment in the offing," Surya told reporters here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu