»   »  మదురై పడుచుగా హీరోయిన్ పూర్ణ

మదురై పడుచుగా హీరోయిన్ పూర్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అసిన్‌కు నకలుగా కనిపించే ముద్దుగుమ్మ పూర్ణ గుర్తుండే ఉంటుంది. అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయి చిత్రం చేసిన ఆమె ఆ చిత్రం విజయంతో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అవును చిత్రం చేసింది. ఇప్పుడు మదురై పడుచుగా మారింది. కరుణానిధి మనవడు అరుల్‌నిధి హీరోగా వస్తున్న 'తగరారు'లో ఆమె అక్కడి అమ్మాయిగా నటిస్తోంది. ఈ అవకాశం దక్కడమే పెద్ద వరమని చెబుతోంది.

ఈ విషయమై పూర్ణ మాట్లాడుతూ.. '' ఈ చిత్రంలో లంగా, ఓణీతో నటిస్తున్నా. నటి పూజ తొలుత ఈ పాత్రకు ఎంపికయ్యారు. ఆమెకు కాల్షీట్‌ సమస్య తలెత్తడంతో నేను ఆ స్థానంలోకి వచ్చా. హీరో అరుల్‌నిధి నాకన్నా చాలా పొడవు. అయినా సర్దుకుని నాతో నటించారు. ఈ చిత్రం నాకు తప్పకుండా మంచి గుర్తింపునిస్తుంది''అని పేర్కొంది.'మునియాండి..' ద్వారా తమిళంలో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తర్వాత 'కొడైక్కానల్‌', 'కందకోట్టె', 'ద్రోగి', 'విత్తగన్‌'.. వంటి పలు సినిమాల్లో కనిపించినా పేరు మాత్రం రాలేదు. ఇక తెలుగులో ప్రస్తుతం 'మాయదారి మల్లిగాడు' అనే చిత్రం చేస్తోంది. 'ప్రేమ కథా చిత్రమ్'తో హిట్ కొట్టిన మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఈ చిత్రంలో హీరో.

'మాయదారి మల్లిగాడు' చిత్రానికి హనుమ ముప్పరాజు దర్శకత్వం వహిస్తున్నారు. యం.రేవన్‌కుమార్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''వినోద ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలకూ చోటుంది. అల్లరి పిల్లాడిగా సుధీర్‌బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేమ, సెంటిమెంట్, కథానుగుణంగా యాక్షన్ సన్నివేశాలు మిళితమై ఉంటాయి. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది''అన్నారు.

English summary
Actor Poorna is one busy girl these days. Apart from three Telugu movies in hand, she has Jannal Oram, Padam Pesum and Thagararu in K Town. In Chennai for the audio launch of Cloud Nine Movie’s Arulnidhi-starrer, Thagararu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu