»   » అదొక్కటే భాధ : అవేదనతో త్రిష

అదొక్కటే భాధ : అవేదనతో త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించాలని అందరికీ ఉంటుంది. అయితే అది అంత తేలికగా నెరవేరదు. హీరోయిన్స్ అంతా అవకాసం కోసం ఎదురుచూస్తూంటారు. ఆ ఆఫర్ వస్తే తమ నట జీవితానికి పురస్కారం దక్కినట్లే భావిస్తారు. అలాగే త్రిష కూడా ఎదురుచూస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాతో చెప్పింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రజనీకాంతో కు జంటగా నటించలేదన్న దిగులు ఒక్కటే మిగిలి ఉందని నటి త్రిష పేర్కొన్నారు. ఆమె స్టార్ హీరోలు కమలహాసన్‌, విజయ్‌, విక్రమ్‌, అజిత్‌, సూర్య, విశాల్‌ తదితరులతో తెరను పంచుకున్నారు. తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇప్పటివరకు రజనీకాంత్‌తో నటించే అవకాశం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఎంతోమంది అగ్ర నటులతో తెరపై కనిపించా. రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించలేకపోయా. ఆ దిగులు నన్ను నిత్యం వెంటాడుతోంద''ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అవకాశం దక్కుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

I want to ACT with Rajani Sir: Trisha

గతంలో కమలహాసన్‌తో మన్మథ అంబు'లో నటించిన త్రిష ప్రస్తుతం తూంగా వనం'లో ఆయనతో జోడీ కట్టే అవకాశం దక్కించుకున్నారు. ఈ చెన్నై బ్యూటీ కూడా.. ట్విట్టర్ అప్ డేట్స్ లో ముందు వరుసలోనే ఉంది. మొన్నామధ్య లవర్ వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోవడం వెనుక.. ఈ ట్వీట్స్ కీలక పాత్ర పోషించాయి కూడా.

ఆ మాటకొస్తే.. అమ్మడి ప్రేమ నుంచి పెళ్లి వ్యవహారం దాకా అన్నీ విషయాలూ ట్విట్టర్ ద్వారానే బయటకొచ్చాయి. అంతలా.. ట్విట్టర్ ను వాడుకునే త్రిష.. తన అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ సోషల్ ప్లాట్ ఫాంనే ఎంచుకుంది. కెరీర్ తో పాటు ప్రేమ, పెళ్లి గురించి కూడా ఈ చాటింగ్ సెషన్ లో చర్చించింది ఈ చెన్నై సోయగం.

త్రిష వంటి అందాలభామ లైన్ లోకి వచ్చి ఛాటింగ్ సెషన్ లో ఉంటే... ఇక అభిమానుల ఆనందానికి హద్దేముంది. రెగ్యులర్ క్వశ్చన్స్ తో పాటు కొన్ని కొంటె ప్రశ్నలు కూడా క్యూలో నిలిచాయి. హిందీలో తన ఫేవరెట్ హీరో సల్మాన్ ఖాన్ అని చెప్పిన త్రిష... డార్లింగ్ ఫ్రెండ్ ఎవరంటే 'ఆర్య' అని బదులిచ్చింది. జీవితాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఆనందంగా ఉండగలుగుతున్నానన్న త్రిష.

''విన్న ప్రతి విషయాన్ని, చదివిన ప్రతి విషయాన్ని నమ్మొద్దని.. అభిమానులకు సలహా ఇచ్చింది. రానాతో కలసి నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఈ బ్యూటీ... మరి పెళ్లెప్పుడంటే... నచ్చిన వాడు కనిపించి, అతనితో పిచ్చిపిచ్చిగా ప్రేమలో పడిపోయినప్పుడు అంటూ సమాధానమిచ్చింది. మొత్తానికి కొన్ని చిలిపి ప్రశ్నలకు స్పందించని త్రిష.. మిగతా ప్రశ్నలకు మాత్రం ఓపిగ్గా సమాధానమిచ్చి... మాటకారి అనిపించుకుంది.

English summary
Trisha is one heroine who acted with all the top stars in Tollywood and Kollywood, except Rajinikanth. She regrets not being able to share screen space with the Superstar despite being in the Industry for more than 12 years.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu