For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేనొక కూలీని, ఆఫీస్ బాయ్‌ని : రజనీకాంత్

  By Bojja Kumar
  |

  చెన్నయ్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టర్ కాక ముందు బస్ట్ కండక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇవే కాక రజనీ జీవితంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తాజాగా క్రిటిక్ నామన్ రామచంద్రన్ రాసిన రజనీ బయోగ్రఫీలో రజనీ గురించి మనకు తెలియని విషయాలు చాలా పొందు పరిచారు.

  ఇందులో రజనీకాంత్ కు సంబంధించిన అనేక అరుదైన విషయాలు పొందుపరిచారు. ఆయన పర్సనల్ విషయాలతో పాటు, అతని చిన్ననాటి జ్ఞాపకాలు, అతను స్ట్రగుల్ అయిన రోజులు.....శివాజీ రావ్ గైక్వాడ్ అనే బస్ కండర్ గా రజనీకాంత్ అనే సూపర్ స్టార్ గా ఎలా మారాడు? అనే విషయాలు ఇందులో ఉన్నాయి.

  రజనీకాంత్ చాలా కష్టపడుతున్న రోజులవి...చేతిలో చిల్లిగవ్వ కూడా లేని రోజుల్లో రజనీ కేవలం 10 పైసల కూలీకి బెంగుళూరులో బియ్యం బస్తాలు కూడా మోసారు. ఆ తర్వాత బెంగుళూరు టాన్స్ పోర్ట్ సర్వీస్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై కండక్టర్ జాబ్ సంపాదించాడు.

  బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీసులో 1970 మార్చి 19న డ్రైవర్ రాజా బహదూర్ తో కలిసి రజనీకాంత్ సర్వీస్ లో చేరారు. ఆ తర్వాత రజనీకి, రాజా బహదూర్‌కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. రజనీకాంత్ అంత స్పీడుగా టిక్కెట్లు ఎవరూ ఇచ్చే వారు కాదని, చిల్లర కూడా తనదైన స్టైల్ లో ఇచ్చేవాడని గుర్తు చేసుకున్నారు రాజా బహదూర్. ఈ విషయాలు తన బయోగ్రఫీలో పొందు పరిచారు రజనీ.

  మరికొన్ని విషయాలు స్లైడ్ షోలో చూద్దాం...

  రజనీకాంత్ తన గత జీవితాన్ని గురించి గుర్తు చేసుకుంటూ...ఒకప్పుడు నేను సాధారణ వ్యక్తి. బస్ కండక్టర్ గా పని చేసాను, ఆఫీస్ బాయ్ గా, కూలీగా, కార్పెంటర్ గా పని చేసాను అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

  బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో చేరాక తనకు స్నేహుతుడిగా మారిన రాజా బహదూర్‌ తో రజనీకాంత్ చాలా సన్నిహితంగా ఉండే వాడు. రోజూ డ్యూటీ పూర్తయ్యాక ఇద్దరు కలిసి బహదూర్ ఇంటి వద్ద కలిసే వారు.

  ఆ రోజుల్లో రజనీకాంత్‌తో కలిసి అప్పుడప్పుడు మందుకొట్టే వాడని....నేను సారాయి తాగే వాడిని, రజనీ బీర్ తాగే వాడు అంటూ బహూదర్ చెప్పుకొచ్చారు.

  ఇలా నామన్ రామచంద్రన్ రాసిన పుస్తకంలో రజనీకాంత్ గురించిన అనేక విషయాలు బయట పెట్టారు.

  రజనీకాంత్ తో రామచంద్రన్ మాట్లాడి సమగ్ర వివరాలతో రాసిన తొలి ప్రామాణిక పుస్తకమిది కావడం గమనార్హం.

  రజనీ సినీ రంగ అరంగేట్రం నుంచి మొదలుకుని ఈ ఏడాది రాబోతున్న రాణా సినిమా వరకు సంబంధించిన విశేషాలతో ఈ పుస్తకం ఉందని పబ్లిషర్లు అయిన పెంగ్విన్ బుక్స్ ఇండియా వారు చెబుతున్నారు.

  తనను ఈ స్థాయికి తెచ్చిన అభిమానుల పట్ల రజనీ ఎప్పుడూ కృతజ్ఞత ప్రదర్శిస్తూ ఉంటారు. తనను ఈ స్థాయికి చేర్చిన అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాన, అభిమానుల ఆశీస్సులు ఉండబట్టే ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైన నన్ను మళ్లీ బతికించాయని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

  రజనీకాంత్ ప్రస్తుతం ‘కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన చివరి చిత్రం ‘రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య ‘కొచ్చాడయాన్' చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  కొచ్చాడయాన్ చిత్రంలో దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Did you know that passengers would let buses go empty and wait for the one where Rajinikanth was on duty as the superstar, who was then a bus conductor, amazed people by issuing tickets and returning the change in his trademark style?. Critic Naman Ramachandran's biography on Rajinikanth recounts the actor's career in meticulous detail, tracing his incredible cinematic journey from his very first film Apoorva Ragangal in 1975 to memorable forays into Bollywood like Andhaa Kanoon and Hum, from landmark films like Billa, Thalapathi and Annamalai to the mega successes of Baasha, Muthu, Padayappa, Sivaji and Enthiran. Along the way, 'Rajinikanth: The Definitive Biography' provides rare insights into his personal life, from his childhood days to his times of struggle - when he was still Sivaji Rao Gaekwad - and then his eventual stardom: revealing how a legend was born.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X