»   »  హాస్పటిల్ లో ఉన్న కమల్ వాయిస్ మెసేజ్

హాస్పటిల్ లో ఉన్న కమల్ వాయిస్ మెసేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్లు దిగుతుండగా కిందపడి గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కమల్‌ కాలుకి సర్జరీ చేశారు. తాను త్వరలోనే కోలుకుని నడుస్తానని కమల్‌ అన్నారు. ఈ మేరకు ఆయన తన అభిమానులని ఉద్దేసించి ఓ వాయిస్ మెసేజ్ ని విడుదల చేసారు.

ఇది ప్రమాదం, బాధ కావచ్చు.. కానీ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాపై చూపించే ప్రేమకు మంత్రముగ్దుడ్ని అవుతున్నాను' అనే వాయిస్‌ మెసేజ్‌ను ప్రైవేటు ఆసుపత్రి నుంచి కమల్‌ పంపారు.

I will walk soon, getting well: Kamal Haasan

అలాగే 'నేను నిలబడగలుగుతున్నాను, త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాల్లో తెలియడం లేదు' అనికమల్‌ చెప్పారు.

కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న 'శభాష్‌ నాయుడు' చిత్రం తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ లాస్‌ఏంజెల్స్‌లో ఇటీవల పూర్తైంది. ఈ చిత్రంలో కమల్‌ కుమార్తె శ్రుతిహాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దశావతారం'లో కమల్‌ నటించిన బలరాం నాయుడు పాత్రలో మళ్లీ ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. కమల్‌ చిన్న కుమార్తె అక్షరహాసన్‌ ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Two days after underwent a surgery for a leg fracture at a hospital here, iconic Tamil actor Kamal Haasan said he was on the path of recovery.“I stood up, sat and soon I will walk and come to thank you all. No words to thank you for your love, yours Kamal Haasan,” he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu